ఏపీ కరోనా అప్‌డేట్‌-5 వేలకు తగ్గిన కొత్త కేసులు-50 వేల లోపే యాక్టివ్‌ కేసులు

ఏపీలో కరోనా ప్రభావం క్రమంగా అదుపులోకి వస్తోంది. నెల రోజుల క్రితం 10 వేలకు పైగా నమోదైన రోజువారీ కేసుల సంఖ్య ఇప్పుడు కేవలం 5 వేలకు చేరువలోనే ఉంటోంది. అంటే కేవలం నెల రోజుల వ్యవధిలోనే రోజువారీ కొత్త కేసుల సంఖ్య సగానికి తగ్గిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 50 వేల కంటే తక్కువగానే ఉండటం మరో ఊరట.

ఏపీలో గత 24 గంటల్లో 5120 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాలో 807 కేసుల చొప్పున నమోదయ్యాయి. ఆ తర్వాత స్ధానంలో పశ్చిమగోదావరి 575, కృష్ణా 464, గుంటూరు 433 ఉన్నాయి. అత్యల్ప కేసులు నమోదైన జిల్లాల్లో కర్నూలు 144 కేసులతో టాప్‌లో ఉండగా.. శ్రీకాకుళం, విజయనగరం చెరో 172 కేసులతో తర్వాతి స్ధానాల్లో ఉన్నాయి. విశాఖ జిల్లా కూడా కేవలం 190 కేసులతో మెరుగైన స్ధితిలో నిలిచింది. వీటితో కలిపి ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7.34 లక్షలకు చేరింది. ఇందులో 6.78 లక్షల మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

ap covid 19 health bulletin shows decrease in new cases, 5200 in last 24 hours

మృతుల సంఖ్యలో తూర్పుగోదావరి 5, అనంతపురం 4, చిత్తూరు 4, కృష్ణాలో 4, విశాఖలో 4, గుంటూరులో 3, నెల్లూరులో 3, కడపలో 2, పశ్చిమగోదావరిలో 2, ప్రకాశం జిల్లాలో ఒకరు ఉన్నారు. గత 24 గంటల్లో 32 మంది చనిపోయారు. వీటితో కలుపుకుని ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 6086కు చేరింది. ఈ లెక్కన చూస్తే మరణాల సంఖ్య కూడా గణనీయంగా అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. మరికొన్ని రోజులు ఇదే పరిస్దితి కొనసాగితే మరణాల సంఖ్య పూర్తిగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+