Mark Shankar: అగ్నికీలల్లో పవన్ కుమారుడు మార్క్ శంకర్ -కాసేపట్లో సింగపూర్ కు..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సింగపూర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఈ విషయం తెలిసింది. దీంతో ఆయన పర్యటన ఆపేసి చేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు, నాయకులు సూచించారు. 'అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని, ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని... కాబట్టి ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకొంటానని పవన్ కల్యాణ్ వారికి స్పష్టం చేశారు.

ap deputy cm pawan kalyan s son injured in fire accident at Singapore school

అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని పవన్ కళ్యాణ్ అధికారులకు చెప్పినట్లు జనసేన పార్టీ వెల్లడించింది. మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కల్యాణ్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ భార్య అనా లెజ్నోవా సింగపూర్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె ఎప్పటికప్పుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్దితిపై పవన్ కు వివరాలు అందిస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+