మద్యం వ్యాపారుల భారీ షాక్, తగ్గిన ఆదాయం-ఆ బార్లపై ఎక్సైజ్ కీలక నిర్ణయం..!!

ఏపీలో బార్ల పాలసీ తేలిపోయింది. ఎక్సైజ్ అధికారుల నిర్ణయాలతో బార్ల టెండర్లకు వ్యాపారులు దూరంగా ఉంటున్నారు. కొత్త బార్ పాలసీలో భాగంగా నిర్ణీత సమయానికి టెండర్లు రాలేదు. కాగా ఎక్సైజ్ శాఖ టెండర్ల గడువు పొడిగించింది. అయినా, ఆశించిన స్థాయిలో స్పందన కనిపించ లేదు. దీంతో, దరఖాస్తులు వచ్చిన బార్ల వరకు లాటరీ ద్వారా ఖరారు చేయాలని నిర్ణయించారు. మిగిలిన వాటికి మరోసారి నోటిఫికేషన్లు జారీ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే, వ్యాపారుల నిర్ణయం ఇప్పుడు ఆదాయం పై ప్రభావం చూపుతోంది.

వ్యాపారుల షాక్
ఎక్సైజ్ శాఖ అధికారుల కొత్త నిర్ణయాలు ఫలించినట్లే కనిపిస్తోంది. బార్ పాలసీలో భాగంగా లైసెన్స్‌ల కోసం దరఖాస్తులు రాకపోవటంతో గడువు పెంచారు. మూడ్రోజులు పొడిగించినా పెద్దగా ఫలితం కనిపించలేదు. 840 బార్లకు నోటిఫికేషన్‌ జారీచేయగా 369 బార్లకే 4 లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. వాటికి మాత్రమే శనివారం ఉదయం లాటరీ నిర్వహించి లైసెన్సీలను ఎంపిక చేస్తారు. మొత్తంగా చూస్తే 471 బార్లు మిగిలిపోయాయి. నిబంధనల ప్రకారం నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ తీయాలి. చాలా బార్లకు ఒకట్రెండు మాత్రమే వచ్చాయి. ఆ రుసుములను దరఖాస్తుదారులకు తిరిగి చెల్లిస్తారు. తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో బార్‌ పాలసీకి ఏ మాత్రం స్పందన కనిపించలేదు. రెండు జిల్లాల్లో కలిపి ఒక్క బార్‌కే నాలుగు దరఖాస్తులు అందాయి.

ap-excise-decided-to-issue-re-notification-for-pending-bars-as-due-date-completes

తగ్గిన ఆదాయం
కాగా, తిరుపతిలో భారీగా దరఖాస్తులు అందాయి. చాలా జిల్లాల్లో నాలుగు దరఖాస్తులు రావడమే కష్టంగా మారిన పరిస్థితుల్లో ఈ జిల్లాలో చాలా బార్లకు 7 నుంచి 8 దరఖాస్తులు వచ్చాయి. ఎన్టీఆర్‌ జిల్లాలోనూ చాలా బార్లకు దరఖాస్తులు అందాయి. బార్‌ పాలసీ విఫలం కావడంతో ఎక్సైజ్‌ శాఖ అధికారులు డీలా పడిపోయారు. ఎన్ని నిబంధనలు పెట్టినా ఒక్క బార్‌ కూడా మిగలదని మొదట్లో అంచనా వేసుకున్నారు. చివరకు కనీసం 50శాతం బార్లకు కూడా లాటరీ తీసే పరిస్థితి రాకపోవడంతో షాకయ్యారు. మరోవైపు.. కల్లుగీత కులాలకు కేటాయుంచిన 84 బార్లకు 75 దరఖాస్తులు అందాయి. ఈ బార్లకు లైసెన్స్‌ ఫీజు 50 శాతం మాత్రమే. అందుకే స్పందన వచ్చింది. వాటికి కూడా శనివారమే లాటరీ తీయనున్నారు. దరఖాస్తుల ద్వారా దాదాపు రూ.20 కోట్ల ఆదాయం ఎక్సైజ్‌ శాఖకు సమకూరింది. ఒక్కో దరఖాస్తు రుసుము రూ.5 లక్షలు. లాటరీ నిర్వహించని బార్లకు రుసుములు వెనక్కి ఇవ్వాలనే నిబంధనతో ఆదాయం తగ్గిపోయింది.

తాజా నిర్ణయం
బార్ పాలసీ పైన ఆసక్తి చూపకపోవటానికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. బార్లకు ఇచ్చే మద్యంపై ప్రభుత్వం అదనంగా 15 శాతం అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ సుంకం విధిస్తోంది. దీనివల్ల బార్‌ లైసెన్సీలు ఏడాదికి సుమారు రూ.240 కోట్లు అదనంగా చెల్లిస్తున్నారు. ఒక్కో లైసెన్సీ సగటున రూ.30 లక్షలు అదనంగా కడుతున్నారు. ఈ నిబంధన తొలగించాలని వ్యాపారులు ప్రభుత్వాన్ని అనేకసార్లు కోరిన సానుకూల స్పందన కనిపించలేదు. ఇంకోవైపు.. కొత్తగా ప్రతి బార్‌కు కనీసం 4 దరఖాస్తులు రావాలని.. అప్పుడే లాటరీ తీస్తామన్న నిబంధన తెచ్చారు. నాలుగు దరఖాస్తులంటే రూ.20 లక్షలు వెచ్చించాలి. ఈ రెండు నిబంధనలతో తమపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని భావించిన వ్యాపారులు ఈసారి దరఖాస్తు చేయకుండా దూరంగా ఉండిపోయారు. కొత్తవారు వ్యాపారంలోకి వస్తారనుకుంటే అదీ జరగలేదు. చివరకు రాష్ట్రంలో ఎప్పుడూలేని విధంగా భారీ సంఖ్యలో బార్లు మిగిలిపోయాయి. మిగిలిన బార్లకు త్వరలోనే రీనోటిఫికేషన్‌ జారీచేయాలని నిర్ణయించారు. అన్ని బార్లకు లైసెన్సీలు వచ్చేవరకూ ఇలా నోటిఫికేషన్లు ఇస్తూనే ఉండేలా కసరత్తు జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+