ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!
మందుబాబులకు గుడ న్యూస్. మద్యం ధరలు తగ్గనున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో ఎక్కువ ఉన్న బ్రాండ్ల ధరలను తగ్గించాలని నిర్ణయించారు. ధరలు.. రెవిన్యూ పైన ఎప్పటికి అప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న ఎక్సైజ్ శాఖ.. తాజాగా ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేసింది. దీని ద్వారా దాదాపు 20 బ్రాండ్ల మద్యం ధరలు తగ్గనున్నాయి. వీటి ధరలు తగ్గించటం ద్వారా ఇక్కడ అమ్మకాలు పెరిగి రాష్ట్రానికి ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
ఏపీలో బ్రాండెడ్ మద్యం ధరలు తగ్గనున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు అందించింది. గు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ప్రీమియం బ్రాండ్ల ధరలు చాలా ఎక్కువ గా ఉండటంతో.. వాటిని భారీగా తగ్గించాలని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదించింది. రాష్ట్రంలోకి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్(ఎన్‌డీపీఎల్) విచ్చలవిడిగా వస్తోంది. ఒక ఖరీదైన ఫారిన్ లిక్కర్ సీసా ధర తెలంగాణలో రూ.22 వేలు ఉంటే... అదే బాటిల్‌ను ఏపీలో రూ.25 వేలకు అమ్ముతున్నారు. మరో బ్రాండ్ రూ.27 వేలు-రూ.33 వేల తేడా ఉంది. ఇక కర్ణాటకతో పోలిస్తే కొన్ని ప్రీమియం బ్రాండ్ల ధరల్లో దాదాపు సగానికి సగం తేడా ఉంది. దీంతో రాష్ట్రంలో ఫారిన్ లేదా ప్రీమియం లిక్కర్ అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయి. వీటి అమ్మకాలు పెరగాలంటే ఆ బ్రాండ్ల ధరలు తగ్గాలని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదించింది. క్యాబినెట్‌లో ఆమోదం పొందిన వెంటనే ధరలు తగ్గనున్నాయి. ఈ నిర్ణయంతో 20 ఖరీదైన బ్రాండ్ల మద్యం ధరలు తగ్గనున్నాయి.

పొరుగు రాష్ట్రాల ధరల కంటే ఎక్కువ.. కొత్త ప్రతిపాదనలు
తాజా ప్రతిపాదనల మేరకు ఒక్కో సీసాపై కనీసం రూ.3 వేలు వరకూ తగ్గనుంది. అదే జరిగితే ఇక్కడ అమ్మకాలు పెరిగి రాష్ట్రానికే ఆదాయం దక్కనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాదాపు 40 బ్రాండ్ల ధరలు తగ్గించారు. కానీ ప్రీమియం బ్రాండ్ల ధరలు తగ్గించకపోవడంతో ఆ కేటగిరీలో ఎన్‌డీపీఎల్ రాష్ట్రంలోకి వస్తోంది. ఫలితంగా రాష్ట్రం చాలా ఆదాయం కోల్పోతోంది. అలాగే వైన్ ధరలు కూడా తగ్గించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఖరీదైన లిక్కర్‌తో పాటు వైన్‌పైనా ఎడాపెడా పన్నులు వేశారు. దీంతో ఈ రెండు కేటగిరీల్లో అమ్మకాలు దారుణంగా ఉన్నాయి. ధరలు తగ్గిస్తే అమ్మకాలు పెరుగుతాయని, తద్వారా రాష్ట్ర ఖజానాకు చేరాల్సిన ఆదాయం ఇక్కడే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే జరగనున్న క్యాబినెట్ భేటీలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించిన వెంటనే కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఈ నెల 13న జరిగే మంత్రివర్గ భేటీలో ఎక్సైజ్ శాఖ తాజా ప్రతిపాదనల పైన చర్చించి.. ఆమోద ముద్ర వేయనున్నారు.












Click it and Unblock the Notifications