అన్నీ డ్రాప్ అవుట్సే- వైసీపీ సహా- బడ్జెట్ స్పీచ్ లో పయ్యావుల సెటైర్లు..!
ఏపీలో ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్.. తన ప్రసంగంలో విపక్ష వైసీపీపై సెటైర్లు వేశారు.రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసీపీ పాలనతో వివిధ రంగాల్లో జరిగిన విధ్వంసాన్ని ఆర్ధిక మంత్రి గుర్తుచేశారు. ఈ సందర్భంగా వైసీపీ గత ఎన్నికల ఓటమిని దీనికి లింక్ చేస్తూ ఆర్ధిక మంత్రి పంచ్ లు విసిరారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి. ఇంతకీ ఆర్థికమంత్రి వైసీపీని ఉద్దేశించి ఏమన్నారో ఓసారి చూద్దాం..
ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్.. ఇవాళ తన తన బడ్జెట్ ప్రసంగంలో డ్రాప్ అవుట్స్ పదాన్ని వాడుతూ వైసీపీపై సెటైర్లు వేశారు.గత ప్రభుత్వంలో స్కూళ్లల్లో విద్యార్థుల డ్రాప్ అవుట్సే కాదు, చాలా రంగాల్లో డ్రాప్ అవుట్స్ జరిగాయంటూ ఆర్థికమంత్రి గుర్తుచేశారు. పరిశ్రమలు డ్రాప్ అవుట్ అయ్యాయని, రాష్ట్రం నుంచి ఉద్యోగాలు డ్రాప్ అవుటయ్యాయని, పేదలకు ఉపాధి డ్రాప్ అవుట్ అయిందని పయ్యావుల గుర్తుచేశారు.

గత ప్రభుత్వ పాలకులు ఇప్పుడు ఓటమితో సభకు రాకుండా అసెంబ్లీ నుంచి కూడా డ్రాప్ అవుట్ అయ్యారంటూ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ప్రజా జీవితం నుంచి శాశత్వంగా డ్రాప్ అవుట్ అయ్యే రోజులు అతి త్వరలోనే ఉన్నాయంటూ పయ్యావుల విపక్షానికి చురకలు అంటించారు. ఇప్పటికే బడ్జెట్ కు రాకుండా అసెంబ్లీ నుంచి బాయ్ కాట్ చేసిన నేపథ్యంలో పయ్యావుల కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications