ఏపీలోని పాఠశాలల్లో వారికి నో ఎంట్రీ.. కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలల్లో రాజకీయాలకు నో ఎంట్రీ అని స్పష్టం చేసింది. పాఠశాలల్లో రాజకీయ పార్టీల గుర్తులు, వస్తువుల ప్రదర్శనను నిషేధించింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. పాఠశాల ఆవరణలోకి తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు తప్ప ఏ ఇతర అనధికారిక వ్యక్తులను అనుమతించరాదని ఆదేశాలు ఇచ్చింది. ఈ రూల్ ఈరోజు నుంచే అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది. కూటమి ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల విషయంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలల్లో రాజకీయ పార్టీల గుర్తులు, వస్తువుల ప్రదర్శనను నిషేధించింది. పాఠశాలల్లో రాజకీయాలకు నో ఎంట్రీ అని ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల ఆవరణలోకి తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు తప్ప ఏ ఇతర అనధికారిక వ్యక్తులను అనుమతించరాదని ఆదేశాలు ఇచ్చింది. బయటి విద్యార్థులతో ఇతర వ్యక్తులు ఫోటోలు దిగడం కూడా నిషేధం అని పేర్కొంది. ఈ మేరకు జీవో విడుదల చేసింది.

మరోవైపు ఏపీ ప్రభుత్వం స్కూల్ విద్యార్థుల కోసం విద్యా హక్కు చట్టం ప్రకారం ఒక పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు విద్యార్థులకు ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ అందిస్తోంది. నెలకు రూ.600 చొప్పున ప్రభుత్వం ఇస్తోంది. అలాగే మొత్తం 10 నెలలకు గాను రూ.6 వేలు అందించనుంది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.












Click it and Unblock the Notifications