విద్యార్థులకు డబ్బులివ్వాలంటూ కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు

ఏపీలో చంద్రబాబు సారథ్యంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తల్లికి వందనం పేరుతో ఇస్తున్న ఫీజు రీఎంబర్స్ మెంట్ ను నేరుగా కళాశాలల యాజమాన్యం ఖాతాల్లో వేయనున్నారు. ఇకనుంచి విద్యార్థులను కళాశాలలు వేధిస్తే కఠిన చర్యలుంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. అలాగే పాఠశాల విద్యార్థులకు సంబంధించి తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లలో కీలక మార్పులు చేయబోతున్నారు.

ఎటువంటి పార్టీ రంగులు లేకుండా..
యూనిఫామ్ తోపాటు వారికిచ్చే బ్యాగులు, బెల్టుల రంగు మారుస్తున్నారు. గత ప్రభుత్వం వీటిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు ఉండేది. ఇప్పుడు మాత్రం వాటిపై ఎవరి పేర్లు లేకుండా విద్యార్థులకు అందివ్వబోతున్నారు. దీనివల్ల వారిపై రాజకీయంగా ఎటువంటి ప్రభావం ఉండదని, చదువుపై దృష్టిపెడతారని, ఇంట్లో కూడా రాజకీయ చర్చలు జరగవని ప్రభుత్వం భావిస్తోంది. చివరికి విద్యార్థులకిచ్చే బెల్టులపై కూడా వైసీపీ రంగు వేశారు. నోటు పుస్తకాలపై జగన్ బొమ్మను ముద్రించారు. ఇప్పుడు అటువంటివేమీ లేకుండా ఇస్తున్నారు. బ్యాగులు కూడా ఎంతో నాణ్యంగా ఉండేలా చూస్తున్నారు. నాణ్యతలో తేడా వస్తే కాంట్రాక్టర్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.

AP government takes key decision to provide money to students to get uniforms sewn

యూనిఫాం కుట్టించుకోవడానికి..
యూనిఫాం కుట్టించుకోవడానికి ఎనిమిదో తరగతి విద్యార్థులకు రూ.120, 9, 10 చదివే విద్యార్థులకు 240 ప్రభుత్వం చెల్లించబోతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకివ్వబోతున్న కిట్లలో మూడు జతల యూనిఫామ్స్, షూస్, బ్యాగ్, డిక్షనరీ, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, పాఠ్య పుస్తకాలు ఉంటాయి. ఒక్కో కిట్ కు రూ.1859 అవుతుందని అంచనా వేశారు. డిసెంబరులో టెండర్లు పిలవబోతున్నారు. దీనికితోడు మధ్యాహ్న భోజన పథకం ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. డిసెంబరు నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. ప్రాథమిక పాఠశాలలో ఒక్కో విద్యార్థికి ఇకనుంచి రూ.6.19, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదివేవారికి రూ.9.29 ఇవ్వనున్నారు. వీటిల్లో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+