పాఠశాలల ప్రారంభ వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం - 17 వరకు ఇలా..!!
వేసవి సెలవులు ముగిసాయి. రేపటి నుంచి (సోమవారం) తిరిగి బడి గంటలు మోగనున్నాయి. ఎండల తీవ్రత మాత్రం తగ్గలేదు. దీంతో పాఠశాలల ప్రారంభం వాయదా వేయాలనే అభ్యర్ధనలు వచ్చాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం ఎండల తీవ్రత కారణంగా కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల ప్రారంభం నిర్ణయంలో మార్పు లేకపోయినా..ఈ నెల 17వ తేదీ వరకు మాత్రం ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు విధి విధానాలను ఖరారు చేసింది.
17వరకు ఒంటిపూట బడులు : పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఏపీలో గరిష్ఠంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సమయంలో పాఠశాలల ప్రారంభం వాయిదా వేయాలని ప్రతిపక్షాలు ప్రభుత్వానికి లేఖలు రాసాయి. దీనిని పరిశీలించిన ప్రభుత్వం పాఠశాలలు యధావిధిగా ప్రారంభిచాలని నిర్ణయించింది. ఇదే సమయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఈ నెల 12న ప్రారంభం కానున్న పాఠశాలలను ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట నిర్వహించాలని ఆదేశించింది. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పాఠశాలలు నిర్వహించాలని నిర్ణయించింది. 17వ తేదీ నాటికి ఎండల తీవ్రతను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయింది. దీంతో, ఉదయం 9 గంటల లోగానే పాఠశాలల్లో రాగి జావ పంపిణీ చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.
రేపటి నుంచే విద్యా కానుక : పాఠశాలల ప్రారంభం సమయంలోనే విద్యా కానుక అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం జగన్ పల్నాడు జిల్లా క్రోసూరులో లో విద్యా కానుక ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాల ల్లోనూ విద్యా కానుక అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. 43 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం కింద యూనిఫాం, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, బ్యాగ్, ఇంగ్లిష్, తెలుగు (బైలింగ్వల్) టెక్ట్స్ బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీ, నోటు పుస్తకాలు అందించనున్నారు.
విద్యా కానుక కోసం ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,100 కోట్లు ఖర్చు చేస్తోంది. విద్యా కానుక కిట్ల నాణ్యత విషయంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది యూనిఫాం కుట్టుకూలిని రూ.10 పెంచి రూ. 45 ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

28న అమ్మఒడి నిధుల విడుదల : ఈ నెల 28న ఏపీ ప్రభుత్వం అమ్మఒడి నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. దాదాపు 44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఈ మొత్తం జమ కానుంది. ఏపీ ప్రభుత్వం విద్యాశాఖలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. భావితరాల విద్యా విధానాల కోసం వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేసింది. నిష్ణాతులు...నిపుణులు..ఉన్నతాధికారులతో ఈ వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేసారు.
నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ అమలు కోసం ఈ వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేసారు. గ్రూపు ఛైర్మన్ గా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి..కన్వీనర్ గా కమిషనర్ ఉంటారు. సభ్యులుగా అశుతోష్ చద (మైక్రో సాఫ్ట్ ఇండియా) శాలిని కపూర్ (అమెజాన్ వెబ్ సిరీస్) శ్వేతా కరుణ (ఇంటెల్ ఆసియా), గూగుల్, నాస్కామ్ జైజిత్ భట్టాచార్య, అర్చన జి గులాటి వ్యవహరించనున్నారు.
-
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications