డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక బాధ్యతలు, ఆదాయం..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళల కోసం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. వరుస పథకాలను అమలు చేస్తోంది. డ్వాక్రా సంఘాల బలోపేతం కోసం మద్దతు అందిస్తోంది. రివాల్వింగ్ ఫండ్ కేటాయింపు ద్వారా ఆర్దికంగా చేయూతనిస్తోంది. తాజాగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా సంఘాలకు కొత్త బాధ్యతలు అప్పగించనుంది. ఆదాయం సైతం పెరగనుంది.
ఏపీ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు కీలక బాధ్యతలు అప్పగించనుంది. ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లల్లో మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉంది. ఈ పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేయాలని ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా స్మార్ట్ కిచెన్ల బాధ్యతలను మహిళా సంఘాలకు అందించనుంది. ఇప్పటికే రాష్ట్రంలోని కడప, జమ్మలమడుగు వంటి ప్రాంతాల్లో స్మార్ కిచెన్లను మహిళా సంఘాలకు అప్పగించడంతో సక్సెస్ అయింది. దీంతో త్వరలో మరో 33 స్మార్ట్ కిచెన్ల బాధ్యతలను కూడా వారిని ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. వంట వండటమే కాకుండా ప్యాకింగ్, సమయానికి భోజనం పంపించడం, వ్యర్థాల నిర్వహణ వంటి బాధ్యతలను మహిళలకు అప్పగించనున్నారు.

అదే విధంగా ఇక నుంచి రాష్ట్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నేచురల్ ఫార్మింగ్ కూరగాయ లు పండిస్తున్నారు. వీటిని మధ్యాహ్న భోజనం పథకానికి ఈ విధంగా పండించిన కూరగాయలు మధ్యాహ్న భోజన పథకంకు సరఫరా చేయడం వల్ల వారికి ఆదాయం లభిస్తుంది. అలాగే సేంద్రీ య వ్యవసాయంపై మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇందుకు మండల సమాఖ్యలు సహాయం చేయనున్నాయి. ఆర్గానిక్ కూరగాయలు మధ్యాహ్న భోజన పథకంలో ఉప యోగించడం వల్ల పిల్లలకు పోషక విలువలు కూడా పెరగనున్నాయి. అంతేకాకుండా మహిళలకు ఉపాధి తో పాటుగా ఆదాయం సమ కూరనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహాలోనే అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. డ్వాక్రా సంఘాలకు దీని ద్వారా ఉపాధితో పాటుగా ఆర్దికంగా ప్రయోజనం కలగనుంది.












Click it and Unblock the Notifications