డీఎస్సీ పై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్..!!

ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు దిశగా అడుగుల వేస్తోంది. అధికారంలోకి వస్తే డీఎస్సీ నోటిఫికేషన్ పైన తొలి సంతకం చేస్తామని నాడు హామీ ఇచ్చారు. ఇప్పటికే మెగా డీఎస్సీ నిర్వహణ పైన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా డీఎస్సీ నిర్వహణ .. పోస్టుల భర్తీ పైన ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. టెట్ కీ విడుదల చేసిన ప్రభుత్వం.. టీచర్ పోస్టుల భర్తీకి ముహూర్తం ఖరారు చేసింది.

డీఎస్సీ నోటిఫికేషన్
ఏపీ ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణ పైన కసరత్తు చేస్తోంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ కోసం ముహూర్తం ఫిక్స్ చేసింది. నవంబర్ 6న నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. 16,347 టీచర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. దీనికి అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పోస్టుల రోస్టర్‌ వివరాలు సమర్పించాలని ఇటీవల పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు నవంబరు 2న ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలు విడుదల చేసిన తర్వాత డీఎస్సీ ప్రకటిస్తే కొత్తవారు కూడా దరఖాస్తు చేసుకునే వీలు కలుగుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

AP Govt decided to release DSC notification on 6th November

వచ్చే విద్యా సంవత్సరం లోగా
వచ్చే మూడు నుంచి నాలుగు నెలల్లో డీఎస్సీ ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి వారికి బాధ్యతలు అప్పగించాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది. వేసవి నాటికి కొత్త టీచర్లకు శిక్షణ పూర్తిచేసి, వచ్చే విద్యా సంవత్సరంలో బడులు తెరిచే సమయానికి వారికి పాఠశాలల్లో బాధ్యతలు అప్పగించేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. కొత్త టీచర్లు వస్తే ప్రధానంగా ప్రాథమిక పాఠశాలల్లో ఏకోపాధ్యాయ సూళ్ల ఇబ్బందులు పరిష్కారం అవుతాయి. రాష్ట్రంలో దాదాపు 12వేల పాఠశాలలు ఒకే టీచర్‌తో నడుస్తున్నాయి. ఉపాధ్యాయుల భర్తీ పూర్తయితే ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీరనుంది.

టెట్ కీ విడుదల
కొత్తగా టెట్‌ రాసేవారికి అవకాశం కల్పించాలని అభ్యర్థులు కోరడంతో డీఎస్సీ నిర్వహణ మూడు నెలలు వాయిదా వేసింది. ఇటీవల టెట్‌ ముగియడంతో ఇప్పుడు డీఎస్సీకి సిద్ధమైంది. ఇటీవల ముగిసిన ఉపాధ్యాయ అర్హత పరీక్షల(టెట్‌) తుది కీ విడుదల చేసారు. దీనిని పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఉంచారు. ప్రాథమిక 'కీ'పై అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం తుది 'కీ' విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, నవంబరు 2న టెట్‌ ఫలితాలు విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 3,68,661 మంది టెట్‌ రాశారు. అర్హత పొందినవారికి డీఎస్సీలో దరఖాస్తు చేసుకునే అవకాశం దక్కనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+