ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 51,603 ఎకరాల భూములను నిషేధ జాబితా 22ఏ నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అలాగే పక్షం రోజుల్లోగా.. రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా ఉన్నవాటిని పట్టా భూములుగా మార్చి ఆ సంస్థ పేరిట మ్యుటేషన్ చేయాలని స్పష్టంచేసింది. ప్రజలకు పరిహారం చెల్లించిన అనంతరం ఏపీఐఐసీ చేతిలో ప్రభుత్వ భూములు, డీకెటీ భూములును నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
నిషేధ జాబితాలో ఉన్న పారిశ్రామిక భూములపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎలాంటి అభ్యంతరాలు లేని 70 వేల ఎకరాల ఏపీఐఐసీ భూములను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి అనుమతించింది. అధికారిక లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు 1.56 లక్షల ఎకరాలను ఏపీఐఐసీకి కేటాయించగా.. వాటిలో 1,21,603 ఎకరాలు ఇప్పటికీ నిషేధ జాబితాలో ఉండడం గమనార్హం. ఇందులో 70 వేల ఎకరాల ప్రభుత్వ, డీకేటీ (అసైన్డ్) భూములు కూడా ఉన్నాయి. ప్రభుత్వ భూములు అందుబాటులో లేనిచోట భూ సేకరణ చట్టం కింద 51,603 ఎకరాల పట్టా భూములను సేకరించి ఇచ్చారు. అనేక ప్రాంతాల్లో అసైన్డ్ భూములకు కూడా పరిహారం ప్రకటించి సేకరించారు. వీటిని ఏపీఐఐసీ అనేక పరిశ్రమలకు మార్కెట్ ధరకు కేటాయించింది. అంటే ఆయా పరిశ్రమలు ప్రభుత్వం నిర్ణయించిన ధరను ఏపీఐఐసీకి చెల్లించి భూములు తీసుకున్నాయి. అయినా ఇప్పటికీ అవి రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగానే నమోదయి ఉన్నాయి. వాటి వర్గీకరణ, స్వభావం మార్చలేదు.

ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో విధి విధానాలు
దీంతో, ఆయా పరిశ్రమలు ఆ భూములను తనఖాపెట్టి రుణాలు తీసుకోలేకపోతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని పరిశ్రమలు, కంపెనీలు, ఏపీఐఐసీ ప్రభుత్వాన్ని దీర్ఘకాలంగా కోరుతు న్నాయి. ఇప్పటికే పారిశ్రామిక రాయితీలను నేరుగా కంపెనీలకే చెల్లించేందుకు ఎస్ర్కో ఖాతా తెరచిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు అనూహ్యంగా, వాటికిచ్చిన భూముల స్వభావం, క్లాసిఫికేషన్ మార్చడంతో పాటు నిషేధం నుంచి విముక్తి కల్పించాలని కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత 51,603 ఎకరాలను 22ఏ నుంచి తొలగించాలని పరిశ్రమల శాఖ కార్యదర్శి ఉత్తర్వులు (జీవో 61) జారీ చేశారు. తర్వాత వాటిని ఏపీఐఐసీ పేరిట పట్టా భూమిగా మ్యుటేషన్ చేయాలని.. ఇదంతా యుద్ధప్రాతిపదికన చేపట్టాలని.. మొత్తం ప్రక్రియను 15 రోజుల్లోగా పూర్తిచేయాలని కలెక్టర్లు, ఆర్‌డీవోలు, తహశీల్దార్లు, సబ్‌రిజిస్ట్రార్లను ఆదేశించారు. దీంతోపాటు భూముల మ్యుటేషన్, భూ కేటాయింపు ప్రతిపాదనలు, ఇంకా నిషేధ జాబితా నుంచి విముక్తి కల్పించడానికి అనుసరించాల్సిన విధివిధానాలనూ ఉత్వర్వుల్లో స్పష్టం చేసారు.
-
జగన్ సన్నిహిత అధికారితో రహస్య భేటీ, ప్రభుత్వం సీరియస్- ఐఏఎస్ పై వేటు..!! -
బడి పిల్లలు శోభనం పెళ్లి కొడుకులా? ఏంటిది - గరికపాటి వ్యాఖ్యల వివాదం..!! -
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!













Click it and Unblock the Notifications