సీఎం జగన్ సీరియస్: నా ఆదేశాలకే కొర్రీ పెడతారా: ఇక..ఏ నిర్ణయమైనా ఇలా..!
ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. తాను ప్రజా సంక్షేమానికై ఇచ్చిన హామీల.., ఆదేశాలు అమలు విషయంలో కొర్రీల పెడతారా అంటూ అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో..ముఖ్యమంత్రి కార్యాలయం అప్రమత్తమైంది. ఏకంగా బిజినెస్ రూల్స్ ను ప్రస్తావిస్తూ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీకి సూచించింది. ముఖ్యమంత్రి హామీలు, ఆదేశాలు, మంత్రివర్గ నిర‍్ణయాలు త్వరితగతిన అమలయ్యేలా ప్రత్యేకంగా జీవో జారీ చేసింది.
ఇందులో భాగంగా ముఖ్యమంత్రి హామీల తక్షణ అమలుకై అవుట్ టుడే, మోస్ట్ ఇమ్మీడియేట్, ఇమ్మీడియేట్ అనే మూడు కేటగిరీలుగా విభజించింది. ఇక నుండి దీనికి అనుగుణంగా ముఖ్యమంత్రి హామీలు..ఆదేశాల అమలుకు నిర్ణీత కాల వ్యవధి నిర్ణయించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సీఎం సీరియస్..అధికారుల అలర్ట్
ముఖ్యమంత్రి తాను ఇచ్చిన హామీలు..ఆదేశాల అమలు పైన అధికారులను ఆరా తీసారు. పలు అంశాల్లో అధికారులు కొర్రీ పెట్టటం పైన ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. తాను ఇచ్చిన ఆదేశాలే అమలు కాకపోతే..పాలన ఎలా సాగుతుందని ప్రశ్నించారు. వెంటనే అమలయ్యేలా ప్రతీ అంశానికి నిర్ణీత కాల వ్యవధి నిర్ణయించాలని ఆదేశించారు. ఈ మేరకు బిజినెస్ రూల్స్ ను ప్రస్తావిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ క్రమంలో అవుట్ టుడే కేటగిరీ ప్రకారం సీఎం నిర్ణయం తీసుకున్న రోజే జీవో జారీ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మోస్ట్ ఇమ్మీడియేట్ కేటగిరీలో నిర్ణయం తీసుకుంటే 5 రోజుల్లోగా జీవో జారీ చేయాలి. ఇక ఇమ్మీడియేట్ కేటగిరీలో నిర్ణయం తీసుకున్నట్లయితే 15 రోజుల్లోగా జీవో జారీ కావాలి. ఈ మేరకు వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
మూడు కేటగిరీలుగా విభజన..
సీఎం హామీల తక్షణ అమలుపై సర్కార్ ఫోకస్ పెట్టింది. స్వయంగా సీఎం ఇచ్చిన హామీల అమలు కూడా జాప్యం అవుతుందన్న విషయాన్ని గుర్తించినట్టు జీవోలో పేర్కొన్న ప్రభుత్వం...దీని పరిష్కార దిశగా చర్యలు సూచించింది. సీఎం హామీల అమలును మూడు కేటగిరీలుగా విభజన చేసారు. అందులో అవుట్ టుడే, మోస్ట్ ఇమ్మిడీయేట్, ఇమ్మిడీయేట్ కేటగిరీలుగా విభజించారు. అవుట్ టుడే కేటగిరీలో నిర్ణయం తీసుకున్న రోజే జీవో జారీ చేయాలని స్పష్టం చేసారు.

మోస్ట్ ఇమ్మిడీయేట్ కేటగిరీలో నిర్ణయం తీసుకున్న ఐదు రోజుల్లో జీవో జారీ కానుంది. ఇక..ఇమ్మిడీయేట్ కేటగిరీలో నిర్ణయం తీసుకున్న 15 రోజుల్లో జీవో జారీ చేయాలని ఆదేశించారు. సీఎంఓ ఆదేశాల తర్వాత కూడా కొర్రీల పేరుతో కొన్ని ఫైళ్లు జాప్యం అవుతుండడంపై సీఎం సీరియస్ అవ్వటంతో..ఇక నుండి విధానం మారుస్తూ అన్ని శాఖలు అప్రమత్తంగా వ్యవహరించి..కొత్త మార్గదర్శకాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ధేశించింది.












Click it and Unblock the Notifications