వేసవి సెలవుల ప్రారంభం వేళ విద్యా శాఖ కీలక ఉత్తర్వులు..!!
తెలుగు రాష్ట్రాల్లో నేటితో విద్యా సంవత్సరం ముగియనుంది. రేపు (గురువారం) నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలలకు ఈ నెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకూ వేసవి సెలవులను ప్రకటించారు. వచ్చే విద్య సంవత్సరం జూన్ 12న ప్రారంభం కానున్నాయి. జూనియర్ ఇంటర్ కాలేజీలకు సెలవులు అమలు కానున్నాయి. ఇక, ఇదే సమయంలో ప్రభుత్వం సెలవుల వేళ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా సర్క్యులర్
వేసవి సెలవుల ప్రారంభం వేళ ఏపీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు సర్క్యులర్‌ను మంగళవారం జారీ చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠశాలలకు చివరి పనిదినంగా బుధవారం (ఈ నెల 23) అని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. భారత వాతావరణశాఖ, వైద్య ఆరోగ్యశాఖ సూచనల ప్రకారం వేసవి సెలవుల్లో మార్పులకు అవకాశం ఉందని సర్క్యులర్‌లో వెల్లడించారు. కాగా, పాఠ శాలల పున ప్రారంభం సంసిద్ధత కోసం జూన్ 5 నుంచి టీచర్లు విధులకు హాజరు కావాలని స్పష్టం చేసారు. తాజా సర్క్యులర్ స్టేట్ సిలబస్ అమలు చేస్తున్న అన్ని పాఠశాలలకు వర్తిస్తుంది.

ఉపాధ్యాయుల కోసం
ఇక, రాష్ట్రంలో జూనియర్ ఇంటర్ కాలేజీలు మాత్రం జూన్ 1న తిరిగి ప్రారంభం అవుతాయి. ఈసారి విద్యార్ధులకు మొత్తం 50 రోజులు పాటు స్కూళ్లకు వేసవి సెలవులుగా ప్రకటించారు. 2025- 26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు అందించేందుకు కొత్త పాఠ్యపుస్తకాల ముద్రణ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. బడులు తెరిచిన తొలి రోజే అంటే జూన్ 12వ తేదీన విద్యార్ధులందరికీ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తారు. మరో వైపు విద్యా సంవత్స రం ముగియడంతో డిప్యుటేషన్లపై పని చేస్తున్న ఉపాధ్యాయులు విధుల నుంచి రిలీవ్ అయి చివరి పనిదినమైన ఏప్రిల్ 23న పాత పాఠశాలల్లో చేరాల్సి ఉంటుందని ఇప్పటికే జిల్లా విద్యాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
విద్యార్థి కిట్స్
ఇప్పటికే వేసవి ప్రారంభంకావడంతో అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 18 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం అయ్యాయి. దీంతో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట ఒడులు నిర్వహిస్తున్నారు. ఇటు ఉపాధ్యాయుల బదిలీల అంశం పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏపీలో ఇప్పటికే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసారు. జూలై లో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ఇక.. విద్యార్ధులకు ప్రతీ ఏటా యూనిఫాంతో పాటుగా పుస్తకాలు, ఇతర సామాగ్రితో అందించే కిట్లను సైతం జూన్ 12న అందించేలా ఇప్పటికే విద్యా శాఖ ఆదేశాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications