కారుణ్య నియామకాలకు ఉత్తర్వులు జారీ - సచివాలయాల్లో ఉద్యోగాలు..!!
కరోనాతో మరణించిన ఉద్యుగుల కుటంబాల్లోని వారికి కారుణ్య నియామకాలకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన వారిని గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించేందుకు వీలుగా ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే 1,488 మందికి ఈ కేటగిరీలో ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగాలు పెండింగ్ లో ఉన్న 1,149 మందికి ఆగస్టు 24నాటికి నియామక ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టం చేసింది.
కారుణ్య నియామకాలు:ఏపీ ప్రభుత్వం కరోనాతో మరణించిన కుటుంబాలకు కారుణ్య నియామకాలను పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కారణంగా 2,917 మంది ఉద్యోగులు మరణించారు. వారి కుటుంబ సభ్యుల్లో ఇప్పటి వరకు 2,744 మంది కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,488 మందికి ఉద్యోగాలు ఇచ్చారు.

మరో 1,149 మంది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు వీరి నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయంలో విద్యార్హతలు, రిజిర్వేషన్ రోస్టర్ పాయింట్లను పాటించాలని సంబంధిత శాఖాధిపతులు, కలెక్టర్లకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
టైమ్ లైన్ నిర్దేశం:నియామకాల భర్తీకి ప్రభుత్వం టైమ్ లైన్ ను నిర్దేశించింది.గ్రామ, వార్డు సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ విద్యా అసిస్టెంట్, గ్రామ వ్యవసాయ అసిస్టెంట్, గ్రామ, వార్డు రెవిన్యూ కార్యదర్శి, గ్రామ సర్వేయర్, వార్డు పరిపాలన కార్యదర్శి, వార్డు విద్యా కార్యదర్శి, వార్డు సంక్షేమ కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీటికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దరఖాస్తు ల పరిశీలన ఆగస్టు 17 లోగా పూర్తి చేసి, 24లోగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సచివాలయాల్లో ఉద్యోగాలు:మరణించిన ఉద్యోగికి మైనర్ పిల్లలు ఉంటే వయస్సు, విద్యార్హత ఆధారంగా జీవిత భాగస్వామికి ఉద్యోగం ఇవ్వటానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఉద్యోగ నియామక పత్రం జారీ చేసిన 30 రోజుల్లోగా ఉద్యోగంలో చేరాలని ప్రభుత్వం స్పష్టం చేసింది
గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఆయా పోస్టులను విద్యార్హతలు, సాంకేతిక అర్హతలు ఆధారంగా భర్తీ చేయాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసారు.












Click it and Unblock the Notifications