ప్రధాని మోదీకి చంద్రబాబు స్పెషల్ రిక్వెస్ట్..!!
ఏపీలో కొత్త ప్రాజెక్టుల పైన కసరత్తు కొనసాగుతోంది. విశాఖ , విజయవాడలో మెట్రో ప్రాజెక్టుల పైన ఏపీ ప్రభుత్వం తాజాగా పలు నిర్ణయాలు తీసుకుంది. రెండు నగరాల్లో 2 వేల కోట్లతో రోడ్డు కమ్ మెట్రో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టాలని డిసైడ్ అయింది. ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్ర సాయం కోరాలని చంద్రబాబు నిర్ణయించారు. ఏపీ విభజన చట్టం హామీ మేరకు కేంద్రం తో సంప్రదింపులు జరపాలని సూచించారు. ప్రధానితో చంద్రబాబు ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టు పైన చర్చ చేయనున్నారు. నాలుగేళ్లలో సేవలు అందుబాటులోకి వచ్చేలా లక్ష్యంగా నిర్ణయించారు.
చంద్రబాబు ప్రతిపాదన
విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయ వాడలో 66 కి.మీ మేర, విశాఖపట్నంలో 76.90 కి.మీ మేర మెట్రో ప్రాజెక్టులకు ఇప్పటికే డీపీఆర్ లు ఆమోదించారు. కేంద్రం 2017 లో తీసుకొచ్చిన పాలసీ మేరకు కోల్‌కతాలో వంద శాతం ఈక్విటీ భరిస్తూ రూ.8,565 కోట్లతో 16 కి.మీ మేర మెట్రో ప్రాజెక్టు చేపట్టిన అంశం ప్రస్తావనకు వచ్చింది. ఇదే విధంగా ఏపీలోనూ చేపట్టేలా కేంద్రంతో చర్చలు చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీలోమెట్రో ఉంది. ఈ నిర్ణయం మేరకైనా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలనే ఆలోచన చేస్తున్నారు.

డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్లు
మెట్రో పై నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు మరో కీలక ప్రతిపాదన చేసారు. మెట్రో ప్రాజెక్టులో భాగంగా విజయవాడలో ఎన్‌హెచ్-16పై నిడమానూరు జంక్షన్ నుంచి రామవరప్పాడు వరకు 4.7 కి.మీ., విశాఖపట్నంలో గాజువాక నుంచి స్టీల్‌ప్లాంట్ వరకు 4 కిమీ. మేర రోడ్డు కమ్ డ బుల్ డెక్కర్ ఫ్లైఓవ ర్లను నిర్మాణం పై నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానంలో రోడ్డు ఫ్లైఓవర్ మీద మెట్రో ఎలివేటెడ్ కారిడార్ ఉండనుంది. వీటికి కలిపి డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ గా నిర్ణయించారు. నిడమా నూరు జంక్షన్ నుంచి మహానాడు జంక్షన్ వరకు 7 కి.మీ. ఆరు వరసల ఫ్లైఓవర్ మంజూరైంది. దీని కోసం రూ.1100 కోట్ల మేర ఖర్చవుతుందని అధికారులు అంచనాలు రూపొందించారు.
కేంద్రానికి నివేదిక
అదే విధంగా విశాఖలో గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ వరకు రూ.900 కోట్లు వ్యయం అవుతుందని ప్రతిపాదించారు. కేంద్రంతో త్వరితగతిన చర్చించి మెట్రో పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని నిర్దేశించారు. కేంద్రం స్పందన చూసిన తరువాత ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఏపీ ప్రభుత్వం కార్యాచరణ ఖరారు చేయనుంది. నాలుగేళ్లలో మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకురావాలని చంద్రబాబు లక్ష్యంగా నిర్ణయించారు. కేంద్రం ఏపీ ప్రతిపాదనలకు ముందుకు వస్తే మెట్రో పనులు త్వరలోనే ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications