ప్రకాశం బ్యారేజీపై జగన్: భారీ ట్రాఫిక్ జాం(పిక్చర్స్)
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన బస్సు యాత్రలో భాగంగా గురువారం ప్రకాశం బ్యారేజీని పరిశీలించారు. ఆయన రావడంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు ప్రకాశం బ్యారేజీ వద్దకు వచ్చారు. దీంతో భారీగా ట్రాఫీక్ జాం అయ్యింది.
బ్యారేజీకి రెండు వాహనాలు ఆగిపోయాయి. విజయవాడకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా, బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి వైయస్ జగన్ బస్సు యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. మధురపూడి విమానాశ్రయం నుంచి జగన్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సులో తొలుత ధవళేశ్వరం చేరుకుని కాటన్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ ప్రాంతాలను సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రమంతటికీ మంచి జరిగే పోలవరం ప్రాజెక్టును పక్కనపెట్టి, కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు పట్టిసం ఎత్తిపోతల పథకాన్ని హడావుడిగా చేపట్టారని ఆరోపించారు. చంద్రబాబు సాగిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై అందరూ కలసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. రైతులకు వైకాపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

జగన్ బస్సు యాత్ర
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన బస్సు యాత్రలో భాగంగా గురువారం ప్రకాశం బ్యారేజీని పరిశీలించారు.

జగన్
ఆయన రావడంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు ప్రకాశం బ్యారేజీ వద్దకు వచ్చారు. దీంతో భారీగా ట్రాఫీక్ జాం అయ్యింది.

జగన్
బ్యారేజీకి రెండు వాహనాలు ఆగిపోయాయి. విజయవాడకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా, బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి వైయస్ జగన్ బస్సు యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.

జగన్
మధురపూడి విమానాశ్రయం నుంచి జగన్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సులో తొలుత ధవళేశ్వరం చేరుకుని కాటన్ విగ్రహానికి నివాళులర్పించారు.

జగన్
అనంతరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ ప్రాంతాలను సందర్శించారు.

జగన్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రమంతటికీ మంచి జరిగే పోలవరం ప్రాజెక్టును పక్కనపెట్టి, కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు పట్టిసం ఎత్తిపోతల పథకాన్ని హడావుడిగా చేపట్టారని ఆరోపించారు.

జగన్
చంద్రబాబు సాగిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై అందరూ కలసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

జగన్
పట్టిసీమ మీదున్న ప్రేమను ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. కమిషన్లు, బాబు స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రాజెక్టు నిర్మిస్తున్నారన్నారు.
పట్టిసీమ మీదున్న ప్రేమను ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. కమిషన్లు, బాబు స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రాజెక్టు నిర్మిస్తున్నారన్నారు. స్వార్థ ప్రయోజనాలు, కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి ఉపకరించే పట్టిసం ప్రాజెక్టు నిర్మాణానికి రెండురోజుల్లో భూమి సేకరించిన ప్రభుత్వం, పోలవరం కోసం ఎందుకు చేయలేకపోతోందని నిలదీశారు. పోలవరాన్ని మూడేళ్లలో పూర్తిచేస్తామన్న చంద్రబాబు, పట్టిసం మొదలుపెట్టాక పోలవరాన్ని నాలుగేళ్లకు పెంచారన్నారు.
రాయలసీమపై కపట ప్రేమ చూపుతున్న చంద్రబాబు, అక్కడ ప్రాజెక్టులకు నామమాత్రంగానే బడ్జెట్‌లో నిధులు కేటాయించారన్నారు. సీమకు చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలకు చూపుతామన్నారు. ప్రాజెక్టుల బస్సు యాత్ర ద్వారా ఊరూరా తిరిగి బాబు మోసాలను ప్రజలకు వివరిస్తామన్నారు. బస్సు యాత్ర ప్రకాశం బ్యారేజీ మీదుగా రాయలసీమ ప్రాజెక్టుల వరకు సాగుతుందని జగన్ తెలిపారు.












Click it and Unblock the Notifications