ఆర్బీకే కేంద్రాలు, సిబ్బందిపై ప్రభుత్వం సంచలన నిర్ణయం..!!

కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటనకు సిద్దమైంది. జగన్ హయాంలో గ్రామాల్లో ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలు కూటమి ప్రభుత్వ రైతు సేవా కేంద్రాలుగా మార్పు చేసింది. ఇప్పుడు వీటిని పెద్ద సంఖ్యలో రద్దు దిశగా అడుగులు వేస్తోంది. అదే విధంగా ఆ కేంద్రాల్లో పని చేసే సిబ్బందిని సైతం రేషనలైజేషన్ పేరుతో సర్దుబాటు చేయాలని భావిస్తోంది. వచ్చే కేబినెట్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకునేందుకు కసరత్తు జరుగుతోంది.

కేంద్రాల కుదింపు
రైతు సేవా కేంద్రాలుగా మార్పు చేసిన ఆర్బేకే లను పెద్ద సంఖ్యలో రద్దు చేయటానికి అడుగులు పడుతున్నాయి. వాటిల్లో పని చేస్తున్న సిబ్బందిని సైతం మార్పులు చేయాలని డిసైడ్ అయింది. సిబ్బందిని మార్చటంతో పాటుగా అదనంగా ఉన్న వారిని వేరే కార్యక్రమాలకు కేటాయిస్తోంది. రాష్ట్రంలో 10,778 ఆర్‌ఎస్‌కెలు ఉండగా, రేషనలైజేషన్‌లో రెండు వేల వరకు రద్దు కానున్నాయని అంచనా. కాగా ఈ కసరత్తు గత ప్రభుత్వంలో నిరుడు ఖరీఫ్‌ సమయంలోనే మొదలైంది. కూటమి ప్రభుత్వం ఆర్‌కెఎస్‌ల సేవలను క్రమంగా తగ్గించాలని తలచింది. నేరుగా తామే ఆ పని చేస్తే రాజకీయంగా, ఉద్యోగుల పరంగా ఇబ్బందులు వస్తాయని భావించి గతంలో వైసిపి సర్కారు ఇచ్చిన ఉత్తర్వులను వ్యూహాత్మకంగా బయటికి తీసిన ప్రభుత్వం ఇప్పుడు అమలు దిశగా పావులు కదుపుతోంది.

AP Govt planning for RBK Centers rationalisation and Staff Reshuffle

సిబ్బంది మార్పులు
ప్రభుత్వం తాజాగా ప్రస్తుత ఖరీఫ్‌ లోపు రేషనలైజేషన్‌ పూర్తి కావాలని గడువు విధించింది. అక్టోబర్‌ 29 డెడ్‌లైన్‌ విధిస్తూ గత మార్గ దర్శకాలతో వ్యవసాయశాఖ కమిషనర్‌ మెమో ఇచ్చారు. అప్పుడు కసరత్తు చేసి మధ్యలో నిలిపేసిన జాబితాలనే జిల్లా అధికారులు కమిషనర్‌కు పంపుతున్నట్లు తెలుస్తోంది. అర్బన్‌లో, సెమీ అర్బన్‌లో, పెద్ద గ్రామ పంచాయతీలలో ఎన్ని వార్డు సెక్రటేరియట్‌లు ఉన్నా ఒక్క ఆర్‌ఎస్‌కెకి పరిమితం చేశారు. ఒక ఆర్‌ఎస్‌కె పరిధిలో సరాసరి మైదాన ప్రాంతాల్లో వెయ్యి-1,500 ఎకరాల విస్తీర్ణం, ఏజెన్సీలో 600-800 ఎకరాలుగా నిర్ణయించారు. కాగా ఈ గైడ్‌లైన్స్‌ చాలాచోట్ల గతంలో అమలు చేయలేదు. అత్యధికంగా 3 వేల ఎకరాల వరకు, అతి తక్కువ 600 ఎకరాలుగా పరిధులు నిర్ణయించారు.

ఏం చేయబోతున్నారు
మార్గదర్శకాల ప్రకారం హార్టికల్చర్‌ పంటలు అత్యధికంగా ఉన్న చోట విలేజి హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ (విహెచ్‌ఎ), సెరీ కల్చర్‌ ఎక్కువుంటే విలేజి సెరీకల్చర్‌ అసిస్టెంట్‌ (విఎస్‌ఎ), మిగతాచోట్ల విలేజి అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ (విఎఎ)ని వేయాలి. కసరత్తులో పంటలతో నిమిత్తం లేకుండా సిబ్బందిని కేటాయించారు. హేతుబద్ధీకరణలో వివిఎ, విహెచ్‌ఎ, విఎస్‌ఎ, ఎఇఒ, ఎంపిఇఒలను పరిగణనలోకి తీసు కున్నారు. రేషనలైజే షన్‌లో అర్బన్‌ ఆర్‌బికెలలో తప్పనిసరిగా ఎఇఒలు, ఎంపిఇఒలనే వేయాలని నిబంధన పెట్టారు. అదనపు సిబ్బందిని అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేస్తామంటున్నారు. అయినప్పటికీ తమను ఉంచుతారా తీసేస్తారా అనే ఆందోళన సిబ్బందిలో మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+