రద్దు చేసిన ఫించన్ల పునరుద్దరణ - ఇక మూడు నెలలకోసారి..!!
ఏపీ కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అధికారంలోకి వస్తే పెన్షన్ రూ 3 వేల నుంచి రూ 4 వేలకు పెంచుతామని హామీ అమలు చేస్తోంది. రేపు (జూలై 1న )న రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఇదే సమయంలో పెన్షన్ల విషయంలో ప్రభుత్వం కీలక ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. గత ప్రభుత్వ హాయంలో రద్దు చేసిన ఫించన్ల పునరుద్దరణతో పాటుగా మూడు నెలలకోసారి పెన్షన్లు ఇచ్చే అంశం పైన కసరత్తు చేస్తున్నట్లు మంత్రులు చెబుతున్నారు.
పెన్షన్ల పునరుద్దరణ
వైసీపీ ప్రభుత్వ హాయంలో పలు కారణాలతో దాదాపు అయిదు లక్షల వరకు పెన్షన్లు రద్దు చేసినట్లు కొత్త ప్రభుత్వం గుర్తించింది. విద్యుత్ యూనిట్లు 300 దాటిందనో, వారి పిల్లలు ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారన్న కారణాలతో రద్దు చేశారని వాటిని త్వరలో పునరుద్ధరించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. మూడు నెలలకు ఒక్కసారి కలిపి ఫించన్ ఇచ్చే ఆలోచన కూడా ప్రభుత్వం వద్ద ఉందని చెప్పారు. రాష్ట్రంలో జులై ఒకటో తేదీన పంపిణీ చేయబోయే పెన్షన్ల పెంపు సొమ్మును ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రతి ఇంటికి వెళ్లి నేరుగా అందిస్తున్నామన్నారు.

ఇచ్చిన మాట మేరకు
జగన్ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసినప్పటికీ పేదలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలా తమ ప్రభుత్వం జులై ఒకటో తేదీన పెన్షన్స్ సొమ్ము పెంచి ఇస్తుందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని విడతల వారిగా కాకుండా ఒకేసారి మొత్తం పెన్షన్ల సొమ్మును అందిస్తున్న ఘనత నేటి సిఎం చంద్రబాబు ది అన్నారు. గతంలో జగన్ ఐదేళ్లు విడతలగా పెంచడం వలన దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు నష్టపోయారన్నారు. దివ్యాంగులకు రూ.3000 నుంచి రూ.6000 కు, వృద్ధులు, వితంతువులకు రూ.3000 నుంచి రూ.4000 కు పెంచి పంపిణీ చేస్తున్నామన్నారు.
రాష్ట్రంలో జులై ఒకటో తేదీన పంపిణీ చేయబోయే పెన్షన్ల పెంపు సొమ్మును ఎటువంటి పొరపాట్లు లేకుండా ప్రతి ఇంటికి వెళ్లి నేరుగా లబ్ధిదారులకు అందించాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం పాలకొల్లు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో… pic.twitter.com/N2NUbe9eYd
— Nimmala Ramanaidu (@RamanaiduTDP) June 30, 2024
తొలి ప్రాధాన్యత
రాష్ట్రంలో మొత్తం 65.18 లక్షల మందికి రూ.4,404 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. చంద్రబాబు దివ్యాంగులు, వృద్ధులు వితంతువులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే తొలి ప్రాధాన్యతని ఇచ్చారన్నారు. సిఎంగా చంద్రబాబు నేరుగా లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయడం దేశ చరిత్రలోనే చారిత్రాత్మక రోజు అన్నారు. రేపటి నుంచి నేరుగా సచివాలయ సిబ్బందితో ఇంటికి వెళ్లి పెన్షన్ అందిస్తాం అన్నారు. జగన్ సచివాలయ ఉద్యోగులతో ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయవచ్చని చెప్పిన మాట వినలేదని మంత్రి అన్నారు.












Click it and Unblock the Notifications