జిల్లాలు, మండలాల పునర్విభజనలో తాజా మార్పులు - :ఫైనల్ గా ఇలా..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలు.. డివిజన్లు.. మండలాల పునర్విభజన పైన స్వల్ప మార్పులకు సిద్దమైంది. ప్రజాభిప్రాయం సేకరించిన ప్రభుత్వం వారి నుంచి వచ్చిన స్పందన మేరకు కొత్త నిర్ణయాలు ఉండాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా గతంలో చేసిన ప్రతిపాదనలకు సవరణలు చేయనుంది. మరోసారి మంత్రివర్గం మార్పు చేసిన ప్రతిపాదనలతో ీ నెల 29న జరిగే మంత్రివర్గ భేటీలో నివేదిక ఇవ్వనుంది. దీని ఆధారంగా తుది నోటిఫికేషన్ జారీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది.

జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. గత నెల 27వ తేదీన జిల్లాల పునర్విభజనపై ప్రాథమిక నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నెల రోజుల పాటు అభ్యంతారాలను స్వీకరించింది. అయితే ఈరోజు(శనివారం)తో గడువు ముగుస్తోంది. ప్రాథమిక నోటిఫికేషన్‌ అనంతరం వ్యక్తమైన అభ్యంతరాలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఏపీ వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు రాగా... వాటిని పరిశీలించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. మార్పులు, చేర్పుల తర్వాత డిసెంబర్ 31వ తేదీన తుది నోటిఫికేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం.

AP govt to made some changes in Districts re organisation as Public demand

జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజంపేటను కడపలో కలిపి, రాయచోటిని మదనపల్లిలో కలిపే ప్రతిపాదనలపై ప్రభుత్వం కీలక సమాలోచనలు చేసింది. ఇప్పటికే ప్రకటించిన మూడు జిల్లాలతో 29 వరకు జిల్లాల సంఖ్య పెరగాల్సి ఉంది. తాజా ప్రతిపాదనలతో 28 జిల్లాలకే పరిమితం చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గూడూరు ప్రజల అభిప్రాయం మేరకు గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కలపాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. అలాగే రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో, రాయచోటిని మదనపల్లి జిల్లాలో, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేయాలన్న అంశంపైనా చర్చ జరిగింది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

కాగా.. విస్తీర్ణ పరంగా పెద్దదైన ఆదోనిని రెండు మండలాలుగా విభజించాలనే అభిప్రాయానికి వచ్చారు. మరోవైపు, అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్‌ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్‌ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. మునగపాకను అనకాపల్లి డివిజన్‌లోనూ, అచ్యుతాపురంను అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్‌లో చేర్చాలని సమావేశంలో నిర్ణయించారు. కాగా, రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటుకానున్న పోలవరం జిల్లాలో ఎటువంటి మార్పు లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+