రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం బిగ్ ఆఫర్- ఇక నుంచి కొత్తగా..!!
ఏపీ ప్రభుత్వం రేషన్ లబ్ది దారులకు బిగ్ అప్డేట్ అందిస్తోంది. అధిక ధరలతో నిత్యావసరాల కొను గోలు భారంగా మారిన వేళ.. ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రజలకు సబ్సిడీపై సరుకులు అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఉల్లిపాయల్ని కేజీ రూ. 35కే రైతు బజార్ల ద్వారా అందిస్తోన్న ప్రభుత్వం.. ఇక నుంచి రేషన్ షాపుల ద్వారా కందిపప్పు, పామాయిల్, పంచదార, గోదుమపిండిని రాయితీ ధరకు సరఫరా చేసేందుకు నిర్ణయించింది.
రేషన్ లబ్దిదారులకు నిత్యావసరాలు సబ్సిడీ ధరల పై అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే రేషన్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన ప్రభుత్వం మరిన్ని సరుకులు రేషన్ దుకాణాల ద్వారా అందించేందుకు సిద్దమైంది. స్మార్ట్ రేషన్ కార్డుల జారీ ద్వారా పంపిణీ ప్రక్రియను కొనసాగిస్తోంది. ఇదే సమయంలో సరఫరా వ్యవస్థలోనూ కొన్ని కీలక నిర్ణయాల దిశగా కసరత్తు జరుగుతోంది. కాగా.. రేషన్ షాపుల ద్వారా కందిపప్పు, పామాయిల్, పంచదార, గోధుమపిండిని రాయితీ ధరకు సరఫరా చేస్తామని మంత్రి మనోహర్ ప్రకటించారు. కేంద్ర ఏపీకి 1.20 లక్షల టన్నుల కందిపప్పు, 86,400 కిలో లీటర్ల పామాయిల్ సబ్సిడీ ధరలకు అందించేందుకు అంగీకరించిందని వివరించారు. ఈ సరుకులను రేషన్ షాపుల ద్వారా అర్హులైన కుటుంబాలకు అందించనున్నట్లు వెల్లడించారు.

త్వరలో మీ మార్ట్స్ ప్రారంభం
ఇక.. రేషన్ షాపులను భవిష్యత్తులో 'మీ మార్ట్స్'గా అభివృద్ధి చేసి, సుమారు 64రకాల నిత్యావసర సరుకులను అందుబాటు ధరలకు అందించాలని ప్రభుత్వం . ఇప్పటికే ఈ దిశగా చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు పెరిగాయి. దీంతో.. సబ్సిడీ ధరకే ఉల్లి విక్రయాలు ప్రారంభించారు. ఆధార్ కార్డు ప్రాతిపదికన ప్రతి కుటుంబానికి నెలకు రెండు కిలోల చొప్పున సబ్సిడీ ఉల్లిని ప్రభుత్వం అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో 130 రైతుబజార్లలో ఈ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇదేక్రమంలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలపై నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించేలా సబ్సిడీపై కందిపప్పు, పామాయిల్, చెక్కర, గోధుమ పిండిలను కూడా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.













Click it and Unblock the Notifications
