వైసీపీకి బిగ్ రిలీఫ్- పులివెందుల ఉపఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు..!
ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ జడ్పీటీసీ ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అదే పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక. ఇక్కడ వైసీపీ జడ్పీటీసీ మరణంతో ఉపఎన్నిక జరుగుతోంది. దీంతో ఆ పార్టీ మృతుడి కుటుంబ సభ్యుడే అయిన హేమంత్ రెడ్డిని బరిలోకి దింపింది. అయితే ఈ స్ధానం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీసీటు పరిధిలో ఉండటంతో టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటీ అభ్యర్ధిగా మారెడ్డి లతారెడ్డిని దింపింది.
ఈ నేపథ్యంలో అధికార పార్టీగా తమకున్న అన్ని అవకాశాల్ని వాడుకుంటున్న టీడీపీ, కూటమి నేతలు స్థానికంగా వైసీపీపై పైచేయి సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మరికొందరు నేతలపై కేసులు నమోదు చేసి పులివెందుల ఎన్నిక వేళ అరెస్టు చేసేందుకు సిద్దమయ్యారు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చింది.

టీడీపీ దాడులకు నిరసనగా ర్యాలీ నిర్వహించిన 150 మంది వైసీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేసారు. ఇందులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు. దీంతో ఆయనతో పాటు మరికొందరిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్దమయ్యారు. దీంతో వీరంతా హైకోర్టును ఆశ్రయించడంతో వారిని అరెస్టు చేయకుండా హైకోర్టు పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో ఉన్న వైసీపీ నేతల్ని అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది.

ఇప్పటికే పులివెందులలో జడ్పీటీసీ ఉపఎన్నిక సందర్భంగా వైసీపీ, టీడీపీ నేతలు స్థానికంగా తీవ్ర స్దాయిలో ప్రచారం నిర్వహించడంతో పాటు డబ్బులు పంచుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. అలాగే అధికార కూటమి పదవుల్ని సైతం ఎరగా వేస్తోంది. దీంతో స్థానికంగా పులివెందులలో ఎప్పటికైనా తమ హవాయే నడుస్తుందన్న వాదనతో తమ పార్టీ నేతలు చేజారిపోకుండా వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. రేపు జరిగే ఉపఎన్నికలో 10600 ఓట్లు ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో గెలుపు ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications