వివేకా హత్య కేసు : సీబీఐ తీరుపై అనుమానాలు- ఛార్జ్ షీట్ ఇవ్వండి : హైకోర్టు కీలక ఆదేశాలు..!!

వివేకా హత్య కేసు విచారణకు సంబంధించి సీబీఐకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దిగువ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ తో పాటుగా సాక్షలు వాంగ్మూలాలు.. సాక్షుల విచారణ వివరాలను కోర్టు ముందుంచాలని న్యాయమూర్తి మానవేంద్రనాధ్ రాయ్ ఆదేశించారు. వివేకా మాజీ డ్రైవర్ షేక్‌ దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అనుమతిస్తూ కడప చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌/ప్రిన్సిపల్‌ అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సవాలు చేస్తూ మొదటి నిందితుడు ఎర్ర గంగిరెడ్డి, మరో నిందితుడు ఉమాశంకర్‌రెడ్డి వేసిన వ్యాజ్యాలు హైకోర్టులో విచారణకు వచ్చాయి.

అప్పుడే నిందితుడు అప్రూవర్ గా

అప్పుడే నిందితుడు అప్రూవర్ గా


ఆ సమయంలో పిటీషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు ఆదినారాయణ రావు.. నిరంజన్ రెడ్డి కోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. ఎలాంటి సాక్ష్యాధారాలూ లేనప్పుడే నిందితుడు అప్రూవర్‌గా మారేందుకు వీలుంటుందన్నారు. ప్రస్తుత కేసులో అలాంటి పరిస్థితి లేదని వాదించారు. దస్తగిరి నిందితుడిగా చెప్పిన విషయాన్ని సీఆర్‌పీసీ సెక్షన్‌ 164 కింద వాంగ్మూలంగా నమోదు చేశారని చెప్పారు. తర్వాత దిగువ కోర్టులో సీబీఐ ప్రాథమిక అభియోగపత్రం దాఖలు చేసిందన్నారు. ఒకసారి వాంగ్మూలం నమోదు చేశాక.. అప్రూవర్‌గా మారాల్సిన అవసరం లేదంటూ కోర్టుకు నివేదించారు.

దస్తగిరికి క్షమాభిక్ష విరుద్దం

దస్తగిరికి క్షమాభిక్ష విరుద్దం

నేరాన్ని రుజువు చేసేందుకు దస్తగిరి సాక్ష్యమే ఆధారం అని సీబీఐ చెప్పడం లేదని, కడప కోర్టు దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించడం సీఆర్‌పీసీ నిబంధనలకు విరుద్ధమన్నారు. గతంలో ఈ కేసును విచారించిన పోలీసులు, సిట్‌... దస్తగిరిని నిందితుడిగా పేర్కొనలేదని పిటీషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఆ తరువాతనే సీబీఐ దర్యాప్తు చేసిన తరువాతనే దస్తగిరి పేరు తెర పైకి వచ్చిందని చెప్పారు. ముందస్తు బెయిలు వచ్చేందుకు సీబీఐ సహకరించిందన్నారు. వెంటనే దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అనుమతివ్వాలని కడప కోర్టులో పిటిషన్‌ వేసిందని, సీబీఐ తీరు అనుమానాలకు తావిస్తోందంటూ న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.

సీబీఐకు హైకోర్టు ఆదేశాలు

సీబీఐకు హైకోర్టు ఆదేశాలు


దీనికి ప్రతిగా సీబీఐ న్యాయవాది చెన్నకేశవులు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు వివరాలతో పాటుగా ఎఫ్ఐఆర్.. ఛార్జ్ షీట్.. స్టేట్ మెంట్లను కడప కోర్టులో సమర్పించామని చెప్పారు. వాటిని పరిగణ లోకి తీసుకున్న తరువాతనే న్యాయస్థానం అప్రూవర్ గా మారేందుకు అనుమతి ఇచ్చిందని హైకోర్టుకు నివేదించారు. ఆ వివరాలను పిటీషనర్లకు ఇచ్చామన్నారు. ఈ వాదనల పైన స్పందించిన న్యాయమూర్తి ఇప్పటి వరకు ఎంత మంది సాక్ష్యులను విచారించారు.. నేర నిరూపణలకు అవి సరిపోతాయా వంటి వాటి పైన స్పష్టత రావాలంటే కడప కోర్టులో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ తో పాటుగా ఛార్జ్ షీట్.. వాంగ్మూలాలను పరిశించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసారు.

20వ తేదీకి వాయిదా

20వ తేదీకి వాయిదా


వాటిని తమ ముందు ఉంచాలని సీబీఐని ఆదేశించారు. అయితే, దస్తగిరి తరపు న్యాయవాది అప్రూవర్ గా మారేందుకు అనుమతి ఇవ్వటాన్ని పిటీషనర్లు సవాలు చేయటానికి అవకాశం లేదన్నారు. ఈ నేరానికి సంబంధించిన కీలకమైన అంశానలు పిటీషనర్ సీబీఐకి చెప్పారని వివరించారు. విచారణ కోర్టులో ఇవ్వబోయే వాంగ్మూలం పైన అభ్యంతరం ఉంటే వాటిని పిటీషనర్లు సవాల్ చేసుకొనే అవకాశం ఉందని.. అప్రూవర్ గా మారటాన్ని మాత్రం సవాల్ చేయలేరంటూ తన వాదన వినిపించారు. ఆ కేసును ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+