ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల: సత్తా చాటిన అబ్బాయిలు, కాస్త వెనకబడ్డ అమ్మాయిలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఐసెట్-2022 పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఏపీ ఉన్నత విద్యా మండలి ఐసెట్ పరీక్షలను రెండు సెషన్స్ లో నిర్వహించారు. 24 జిల్లాలతోపాటు హైదరాబాద్ కలిపి మొత్తం 107 పరీక్షా కేంద్రాల్లో ఐసెట్ 2022ను నిర్వహించారు.

ఐసెట్ ఫలితాల్లో మొత్తం 87.83 శాతం మంది అర్హత సాధించారు. ఏపీ ఐసెట్ 2022 పరీక్షకు మొత్తం 42,496 మంది హాజరుకాగా, 37,326 మంది అర్హత సాధించారు. ఫలితాల్లో అత్యధికంగా బాలురు 87.98 శాతం ఉత్తీర్ణత సాధించగా, అమ్మాయిలు 87.68 శాతం ఉత్తీర్ణత సాధించి కాస్త వెనకబడ్డారు.

తిరుపతికి చెందిన రెడ్డప్పగారి ఖాతేం 180 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించాడు. రెండో స్థానంలో గుంటూరుకు చెందిన దంటాలా పూజిత వర్ధన్ నిలిచాడు.

AP-ICET 2022 exam results released

ఫలితాలు ఇలా తెసుకోండి.

అధికారిక వెబ్‌సైట్
https://cets.apsche.ap.gov.in/APSCHEHome.aspx ఓపెన్ చేయాలి.

ఆ తర్వాత హోంపేజీలో కనిపించే ఏపీ-ఐసెట్ 2022 ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రాన్స్ టెస్ట్ విభాగంపై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత Download AP ICET Result 2022ని ఎంపిక చేయాలి.

రిజిస్ట్రేషన్ నంబర్, ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. దీంతో ఫలితాలు స్క్రీన్‌పై కనబడతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+