ఏపీలో ఇంటర్ ఫలితాలు రేపే - ఏర్పాట్లు పూర్తి- రిలీజ్ టైమ్ ఇదే...
ఆంద్రప్రదేశ్ లో మార్చి 4 నుంచి 23వ తేదీ వరకూ నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ రేపు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల తర్వాత ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇంటర్ పరీక్షలు పూర్తయినా మూల్యాంకనంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కరోనా లాక్ డౌన్ సడలింపుల తర్వాత అధికారులు మూల్యాంకనం నిర్వహించారు. తాజాగా ఈ ప్రక్రియ పూర్తి కావడంతో ఫలితాల వెల్లడికి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఫలితాల విడుదలతో పాటు సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ, ఇతర తేదీలను కూడా విద్యామంత్రి ప్రకటించనున్నారు.












Click it and Unblock the Notifications