ఎవరి కోసం: ముద్రగడపై గంటా, 'ఏపీపై బిజెపికి ప్రత్యేక అభిమానం'
న్యూఢిల్లీ: ఎవరి ప్రయోజనాల కోసం ముద్రగడ పద్మనాభం దీక్ష తెలపెట్టారో చెప్పాలని మంత్రి గంటా శ్రీనివాస రావు గురువారం ప్రశ్నించారు. ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. కాపుల రిజర్వేషన్ల అంశం దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉందన్నారు.
ఈ నెల 11 నుంచి దీక్ష చేస్తామని ముద్రగడ సీఎంకు లేఖ రాశారని, లేఖలో వాడిన భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. కాపుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘతన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదే నన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని టిడిపి నిలబెట్టుకుంటుందన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే మళ్లీ ముద్రగడ దీక్ష చేస్తున్నారని గంటా ఆరోపించారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నారన్నారు. బీసీలను కాపులలో చేర్చేందుకు ఎలాంటి అఢ్డంకులు లేకుండా చూసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారన్నారు. రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయం చేసి కాపులకు నష్టం చేయొద్దన్నారు.
ముద్రగడ వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు ఉన్నాయని ఎంపీ తోట నరసింహం అన్నారు. ముద్రగడ వెనుక వైసిపి అధినేత జగన్ హస్తం ఉందని ఆరోపించారు. గతంలో లేని విధంగా కాపులకు చంద్రబాబు న్యాయం చేస్తున్నారన్నారు.

ఏపీపై బిజెపికి ప్రత్యేక అభిమానం: హరిబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన కేంద్రానికి ప్రత్యేక అభిమానం ఉందని బిజెపి ఎంపి హరిబాబు చెప్పారు. ఏపీసముద్ర తీరంలో తరిగిపోని పెట్రో నిల్వలున్నాయన్నారు. ఏపీకి ప్రకటించిన విద్యాసంస్థల ఏర్పాటుపై మంత్రి గంటా ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారన్నారు.
ఏపీలో పెట్రోలియం యూనివర్సిటీని ఏర్పాటు చేయడం ద్వారా ఏపీ పెట్రోహబ్ గా తయారవుతుందన్నారు. విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న గిరిజన యూనివర్సిటీకి కేంద్రం చట్టం చేయాలని, దీనిపై కేంద్ర మానవవనరుల శాఖ మంత్రితో గంటా చర్చించారన్నారు. మంత్రి గంటా చేసిన విజ్ఞప్తి పట్ల కేంద్ర మంత్రులంతా సానుకూలంగా స్పందించారన్నారు.












Click it and Unblock the Notifications