సంచలనం:ఛీటింగ్‌ కేసులో టీడీపీ నాయకుడికి జైలు శిక్ష, జరిమానా

చిత్తూరు జిల్లా:బ్యాంకులను మోసగించిన కేసులో చిత్తూరు జిల్లాకు చెందిన ఒక టిడిపి నేతను కోర్టు దోషిగా తేల్చడం సంచలనం సృష్టించింది. చిత్తూరు జిల్లాకు చెందిన టిడిపి నేత జి.జయశంకర్‌ నాయుడును ఈ బ్యాంకుల ఛీటింగ్ కేసులో కోర్టు ముద్దాయిగా నిర్థారించింది.

ముందుగా ఒక బ్యాంకులో డాక్యుమెంట్ ను పూచికత్తుగా ఉంచి ఆ తరువాత అదే డాక్యుమెంట్ తో మరో బ్యాంకులో రుణం పొంది ఇలా రెండు బ్యాంకులను మోసగించిన కేసులో జి.జయశంకర్‌ నాయుడును కోర్టు దోషిగా తేల్చింది. దీంతో జి.జయశంకర్‌ నాయుడుకు పుత్తూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2500 జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే...

AP TDP leader sent to jail in Cheating case

చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం క్షీరసముద్రం గ్రామానికి చెందిన జి.జయశంకర్‌ నాయుడు(48)...ఆరేళ్ల క్రితం 2012లో తన పొలానికి సంబంధించిన టైటిల్‌ డీడ్‌ను సప్తగిరి గ్రామీణ బ్యాంకు(ఎస్జీబీ)లో పూచీకత్తుగా ఉంచి రూ.2 లక్షల రుణం తీసుకున్నారు. అయితే ఆయన ఆ తర్వాత ఆ బ్యాంకు సిబ్బంది సహకారంతో తాను పూచికత్తు గా ఉంచిన టైటిల్‌ డీడ్‌ను సప్తగిరి గ్రామీణ బ్యాంకు నుంచి అక్రమంగా వెనక్కు తీసేసుకున్నారు.

ఆ తరువాత ఆ డాక్యుమెంట్ ను పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో పూచికత్తుగా ఉంచి మళ్ళీ రూ.2 లక్షల రుణం పొందారు. అయితే రెండేళ్ల తర్వాత సప్తగిరి గ్రామీణ బ్యాంకు శాఖలో ఆడిటింగ్‌ జరిగిన సందర్భంలో ఆ డాక్యుమెంట్‌ మాయమైన సంగతి వెలుగు చూసింది. దీంతో అధికారులు ఆరా తీస్తే బ్యాంకు సిబ్బంది సహకారంతోనే డాక్యుమెంట్‌ మాయమైనట్లు తెలిసింది.

దీంతో అప్పటి సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఏజీఎం చేసిన ఫిర్యాదుతో జయశంకర్‌ నాయుడు, బ్యాంకు సిబ్బంది దుర్గ, కె.శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పుత్తూరులోని జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. విచారణలో జయశంకర్‌ నాయుడు నేరం రుజువు కావడంతో ఆయనకు ఆరునెలల జైలు శిక్షతో పాటు రూ.2500 జరిమానా విధిస్తూ జూనియర్‌ సివిల్‌జడ్జి పి.లీలా వెంకట శేషాద్రి బుధవారం తీర్పు చెప్పారు.

జయశంకర్‌ నాయుడు జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడువారాల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. మిగిలిన నిందితులైన దుర్గ, శ్రీనివాస్‌పై నేరం రుజువు కాకపోవడంతో నిర్దోషులుగా పేర్కొన్నారు. ఏపీపీ ప్రేమ్‌సాగర్‌ ప్రాసిక్యూషన్‌ తరపున వాదించారు. జైలు శిక్షకు గురైన జయశంకర్‌నాయుడు గతంలో చిన తయ్యూరు ఎంపీటీసీగానూ, మండల టీడీపీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. ప్రస్తుతం ఆయన చిత్తూరు జిల్లా టీడీపీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+