నేపాల్‌లో మల్కాజిరిగివాసులు: టీ లేఖ, ఉండవల్లివాసులు కూడా..
హైదరాబాద్: విహార యాత్రకు నేపాల్ వెళ్లిన సికింద్రాబాదులోని మల్కాజిగిరికి చెందిన 25 మంది అక్కడ చిక్కుకుపోయారు. సాయిబాబా ట్రావెల్స్ ద్వారా వీరు అక్కడకు వెళ్లారు. వీరంతా నేరేడ్‌మెట్ వాసులు. ప్రస్తుతం తాము క్షేమంగా ఉన్నట్టు వారు మీడియా సంస్థలకు సమాచారం అందించారు.
సాధ్యమైనంత త్వరగా వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం సహకరించాలని యాత్రీకుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నేపాల్‌లో శనివారం ఉదయం సంభవించిన భూకంపం తీవ్ర అత్యంత భయానకంగా ఉంది.

నేపాల్‌లోని భారతీయ రాయబారి రంజిత్‌కు తెలంగాణ అధికారులు లేఖ రాశారు. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో తెలంగాణ వాసుల సమాచారం తెలపాలని అధికారులు లేఖలో కోరారు. నేపాల్‌లో సంభవించిన భూకంపంలో తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున చిక్కుకున్నట్టు వార్తలు రావడంతో స్పందించిన అధికారులు రాయబారికి లేఖ రాశారు.
ఉండవల్లివాసులు కూడా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉండవల్లి నుంచి నేపాల్ వెళ్లిన 27 మంది యాత్రికులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందింది. ఖాడ్మండ్‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గోరఖ్‌పూర్ నుంచి యాత్రికులతో అధికారులు మాట్లాడారు. నేపాల్‌లో భూకంపం వల్ల రోడ్డు మార్గం దెబ్బతినడంతో యాత్రికులను ఎలా తీసుకురావాలనే అంశంపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications