నేనూ వైసీపీ సోషల్ మీడియా బాధితురాలినే

YS Sharmila: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తల అరెస్టుల వ్యవహారంపై తాజాగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పందించారు. అరెస్టులను పరోక్షంగా సమర్థించారు. వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని సైతాన్ సైన్యంగా అభివర్ణించారు.

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షర్మిల మాట్లాడారు. వైసీపీ సోషల్ మీడియాకు తానూ బాధితురాలినేనని అన్నారు. సొంత చెల్లెలు, తల్లి, చిన్నాన్న, ఆయన కూతురిపై సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడేలా ఒకరకంగా వైఎస్ జగనే ప్రోత్సహించారని ఆరోపించారు.

APCC Chief YS Sharmila hits out at her brother and YSRCP Chief YS Jagan

వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారంపై ఒక్కసారయిన జగన్ స్పందించవుంటే ఈ దుస్థితి వచ్చేది కాదని షర్మిల అన్నారు. ఇలా అన్యాయంగా మాట్లాడవద్దంటూ జోక్యం చేసుకుని ఉంటే ఇది ఆగేదని చెప్పారు. సోషల్ మీడియాలో ఇంత నీచంగా వ్యవహిస్తోన్న వాళ్ల మీద జగన్ నోరు విప్పలేదని ఆరోపించారు.

వైసీపీ సోషల్ మీడియాలో తమపై అబద్ధాలు చెప్పారని, అక్రమ సంబంధాలు అంటగట్టారని, దారుణంగా అవమానించారని, బూతులు తిట్టారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

సోషల్ మీడియా రూపంలో ఒక సైతాన్ సైన్యాన్ని వైసీపీ ఏర్పరచుకుందని, తాను బాధితురాలిని కాబట్టే ఈ మాట అనగలుగుతున్నానని షర్మిల తేల్చి చెప్పారు. తమకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లపై సోషల్ మీడియా ద్వారా వైసీపీ దాడులు చేయిస్తోందని, ఇది సహించరాని విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించడాన్ని షర్మిల తప్పుపట్టారు. ఇది సరైన నిర్ణయం కాదని చెప్పారు. ప్రజలు ఓటేసి గెలిపించింది అసెంబ్లీకి వెళ్లడానికేనని, అధికార పార్టీ చేస్తోన్న తప్పులను ఎత్తిచూపడానికేనని గుర్తు చేశారు. ఎమ్మెల్యే అంటేనే శాసన సభ సభ్యుడని, సభకే వెళ్లనప్పుడు ఆ పదవిలో కొనసాగడం వృధా అని విమర్శించారు.

జగన్ సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదని షర్మిల చెప్పారు. తాము ఓడిపోతే అసెంబ్లీకి వెళ్లం అని ప్రజలకు ముందుగానే చెప్పారా? అని నిలదీశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పడం అవివేకమని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+