ఏపీలో ఉచిత బస్సు వేళ ఆర్టీసీకి షాక్..! రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల ధర్నాలు..!
ఏపీలో కూటమి సర్కార్ సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుకు సిద్దమవుతోంది. ఆగస్టు 15 నుంచి ఈ కీలక పథకం అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఆర్టీసీ కొత్త బస్సులు కూడా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇలాంటి సమయంలో ప్రజా రవాణాశాఖ ఉద్యోగులు ఆర్టీసీకి షాకిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల్లో ఆందోళనలకు దిగారు.
ప్రభుత్వ పరిధిలో ఉన్న పిటిడి (ఆర్టీసి) ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 129 డిపోలలోను, నాలుగు వర్కుషాపులలోనూఎల్లుండి ఎర్రబ్యాడ్జీలు దరించి విధులకు హాజర్యారు. అలాగే ధర్నాలు చేపట్టినట్లు ఆర్టీసీ ఉద్యోగ సంఘం ఈయూ తెలిపింది. రేపు కుడా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు కొనసాగిస్తామని వెల్లడించింది.

సీఎం అనుమతి కోసం వేచి ఉన్న ఆర్టీసి ఉద్యోగుల పదోన్నతులకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 3000 మందికి న్యాయం చేయాలని ఈయూ కోరుతోంది. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్ విజయవంతం కావాలంటే 3000 బస్సులు కొనుగోలు చేయాలని తెలిపింది. ఆర్టీసిలో ఖాళీ ఉన్న 10 వేల మంది సిబ్బందిని భర్తీ చేసేందుకు అనుమతివ్వాలని కోరింది. ఆర్టీసి ఉద్యోగులకు చెల్లించాల్సిన 24 నెలలు 11వ పిఆర్సీ బకాయిలు, డిఏ బకాయిలు చెల్లించాలని కోరింది.

రిటైర్డు ఉద్యోగులకు, చనిపోయినవారికి చెల్లించాల్సిన గ్రాడ్యూటీ/లీవ్ ఎన్ క్యాష్ లు చెల్లించాలని ఈయూ కోరింది. ఆర్టీసీ ఉద్యోగులకు విలీనం కు ముందున్న పాత పద్దతుల్లో రిఫరల్ ఆసుపత్రుల ద్వారా వైధ్యసౌకర్యాలు అందించాలని కూడా కోరుతోంది. ఆర్టీసీలో విలీనానికి ముందున్న ఇన్సెంటివ్ లు/అలవెన్సులు చెల్లించాలని కూడా కోరింది. ఉద్యోగ భద్రతపై ఉన్న సర్క్యులర్ నెం.01/2019ని యధావిధిగా అమలు చేయాలని కూడా తెలిపింది. ఆర్టీసిలో పనిచేస్తున్న ఔట్ సోర్శింగు ఉధ్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరింది. ఆర్టీసి హౌస్ కి 8 కిలోమిటర్లు దూరానికి సీసీఎస్ సొసైటీ ఆఫీసును తరలించాలన్న ఆలోచనను విరమించుకోవాలని కూడా నేతలు కోరారు.












Click it and Unblock the Notifications