TTD: తిరుమలలో భక్తుల కోసం కొత్తగా, ఎక్కడికైనా- ఇక నో ఛార్జ్..!!
Tirumala: తిరుమలలో భక్తుల కోసం మరో కొత్త సేవను టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి తిరుమలలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ఉచితంగా సేవలు అందించనుంది. తిరుమలలో భక్తులను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల సేవలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. భక్తుల నుంచి ప్రయివేటు వాహనాల నుంచి అధిక ఛార్జీల భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
తిరుమలలో భక్తుల కోసం కొత్తగా ఏపీఎస్ఆర్టసీ ఉచిత సర్వీసులను ప్రారంభించింది. తిరుమలలో ప్రైవేట్ వాహనాలు భక్తుల నుండి వసూలు చేస్తున్న అధిక ఛార్జీలను అరికట్టడంతో పాటు కాలు ష్యాన్ని నియంత్రించేందుకు బస్సులను ఉచితంగా తిప్పాలని ఏపీఎస్ ఆర్టీసీని కోరినట్లు ఏఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఆర్టీసీ అధికారులు త్వరితగతిన బస్సు లను ఉచితంగా తిప్పేందుకు ముందుకు రావడంతో కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుమలలో శ్రీవారి ధర్మ రథాలు తిరిగే మార్గంలోనే ఈ బస్సులు తిరుగుతూ ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతా నికి భక్తులను ఉచితంగా చేరవేస్తాయని చెప్పారు. ఈ ఉచిత ట్రిప్పుల ద్వారా భక్తులకు, ఆర్టీసీకి అదనపు ప్రయోజనం చేకూరుతుందని వెంయ్య చౌదరి పేర్కొన్నారు.

ఇప్పటికే టీటీడీ శ్రీవారి ధర్మ రథాల ద్వారా తిరుమలలో ప్రతిరోజూ 300 ట్రిప్పులను తిప్పుతోంద ని చెప్పారు. ఆర్టీసీ బస్సులు తోడవ్వడంతో అదనంగా 80 ట్రిప్పులు తిప్పేందుకు అవకాశం ఏర్ప డిందని తెలిపారు. ప్రతి రెండు నిమిషాలకు బస్సులు అందుబాటు లోకి రావడంతో ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతమవ్వడంతో పాటు బహుముఖ ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. భక్తులు బస్టాండ్ వద్దకు రాకుండా తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఈ ఆర్టీసీ బస్సులను ఎక్కడం ద్వారా నేరుగా తిరుపతికి వెళ్లేందుకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. తిరుమలలో ఏ ప్రాంతం లో బస్సు ఎక్కినా తిరుమల నుండి తిరుపతికి మాత్రమే ఛార్జీలు ఉంటా యని, ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఉచితంగా ఈ సర్వీసులను భక్తులు వినియోగించుకో వాలని వెంకయ్య చౌదరి భక్తులను కోరారు.












Click it and Unblock the Notifications