Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

APSRTC : రూ.2 వేల నోటు తీసుకోవడంపై ఆర్టీసీ కీలక నిర్ణయం- ఇకపై బస్సుల్లో...

ప్రస్తుతం దేశంలో చెలామణీలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకోవాలని ఆర్బీఐ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో నోట్ల రద్దు సమయంలో తీసుకొచ్చిన రూ.2 వేల నోట్ల అవసరం ఇక తీరిపోయిందని, కాబట్టి దీన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అయితే సెప్టెంబర్ 30లోపు బ్యాంకుల్లో దీన్ని డిపాజిట్ చేసుకోవాలని ఓసారి, ఆ తర్వాత కూడా చెల్లుతుందని మరోసారి ప్రకటించి గందరగోళానికి కారణమవుతోంది. దీంతో దీన్ని తీసుకునే వ్యక్తులు, రాష్ట్ర ప్రభుత్వ సంస్ధలు కూడా గందరగోళంలో పడుతున్నాయి.

తాజాగా ఏపీఎస్ఆర్టీసీ రూ.2 వేల నోటును తమ బస్సుల్లో తీసుకునే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2 వేల నోటును బస్సుల్లో తీసుకునే విషయంలో ఉద్యోగులకు ఆర్టీసీ కీలక సూచన చేసింది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో రూ.2 వేల నోటును తీసుకోవద్దని నేరుగా చెప్పని ఆర్టీసీ.. దీన్ని నిరుత్సాహపరచాలని సూచించింది. అంటే తప్పనిసరి అయితేనే తీసుకోవాలని దీని ఉద్దేశం అన్న మాట.

apsrtc orders employees to discourage rs.2000 note with these reasons..

ప్రస్తుత పరిస్ధితుల్లో రూ.2 వేల స్వీకరించడం ప్రయాణికులకు, ప్రజలకు చెడు సంకేతాలు పంపుతుందని ఆర్టీసీ భావిస్తోంది. కండక్టర్లు ప్రయాణికుల నుంచి రూ.2 వేల నోట్లు తీసుకుని డిపాజిట్ చేసేందుకు డిపో క్లర్క్ ల వద్దకు వాటిని తీసుకురావడం అక్రమ లావాదేవీలకు సంకేతంగా మారుతుందని ఆర్టీసీ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. తద్వారా సంస్ధకు చెడ్డపేరు వస్తుందని భావిస్తోంది. అందుకే తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మరోవైపు ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు రూ.2 వేల నోట్లు మినహా మిగిలిన అన్ని నోట్లు తీసుకోవచ్చని, ప్రత్యామ్నాయంగా డిజిటల్ చెల్లింపులను కూడా ప్రోత్సహించమని తమ ఉద్యోగులను ఆర్టీసీ కోరుతోంది. తద్వారా రూ.2 వేల నోట్లకు తాము ప్రత్యామ్నాయాల్ని అందుబాటులో ఉంచినట్లు చెబుతోంది. అయితే తప్పనిసరి పరిస్ధితుల్లో అయితే రూ.2 వేల నోట్లు తీసుకునే అవకాశాలూ లేకపోలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+