APSRTC గుడ్ న్యూస్

హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చేవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని 15 ప్రధాన పట్టణాలకు స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ పేరుతో సంస్థ బస్సులు నడుపుతున్న సంగతి తెలిసిందే. ముందు కొన్ని పట్టణాలకు ప్రయోగాత్మకంగా నడిపించారు.

తర్వాత ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరగడంతో ఈ సేవల్ని విస్తరిస్తున్నారు. మదనపల్లి, బాపట్ల, ఒంగోలు, కందుకూరు, ఆదోని, చిత్తూరు, కడప, చీరాల, నెల్లూరు, వెంకటగిరి, కనిగిరి, చిలకలూరిపేట, విజయవాడ, మచిలీపట్నం, తెనాలికి బీహెచ్‌ఈఎల్, మియాపూర్, ఈసీఐఎల్ నుంచి బస్సులు బయల్దేరతాయి.

apsrtc starts star liner non ac sleeper bus sevices

బీహెచ్‌ఈఎల్, మియాపూర్ నుంచి బయల్దేరే స్టార్ లైనర్ బస్సులు చందానగర్, మియాపూర్, ఆల్విన్ క్రాస్ రోడ్స్, నిజాంపేట, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, ఎస్ఆర్‌నగర్, అమీర్‌పేట్, టెలిఫోన్ భవన్, ఎంజీబీఎస్, ఎల్బీనగర్ బస్ స్టాపుల్లో ఆగుతాయి. ఈసీఐఎల్ నుంచి బయల్దేరే బస్సులు మౌలాలి హౌసింగ్ బోర్డ్ కాలనీ, మల్లాపూర్, నాచారం, హబ్సిగూడ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీ నగర్ మీదుగా ప్రయాణిస్తాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు ముందుగానే బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఏపీఎస్‌ఆర్టీసీ నడుపుతున్న ఈ స్టార్ లైనర్ బస్సులు 2+1 స్లీపర్ కోచ్ లుగా తిరుగుతున్నాయి. ప్రతి బస్సులో 30 కుషన్ సాఫ్ట్ బెర్త్‌‌లు..ప్రయాణికుల కోసం అధునాతన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల కోసం ఛార్జింగ్ పోర్ట్స్, రీడింగ్ లాంప్స్, లగేజీ ర్యాక్స్, ఆడియో కోచ్‌ లాంటివన్నీ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఈ సర్వీసులు నడుస్తున్నాయి. అలాగే బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు కూడా వీటిని ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+