పీఆర్సీ లో మార్పులు ఇలా : సీపీఎస్ పైనా త్వరలో నిర్ణయం : సీఎం ఆదేశాలతో..!!
ఉద్యోగ సంఘాల నేతలు సమ్మె విరమించుకున్నారు. ప్రభుత్వం - ఉద్యోగ సంఘాల నేతల మధ్య జరిగిన ఒప్పందం మేరకు తాజా నిర్ణయాలు అమల్లోకి వచ్చాయి. మినిట్స్ పైన రెండు వైపుల సంతకాలు చేసారు. ఉద్యోగ సంఘాల నేతలు ఈ ఒప్పందాలను వ్యతిరేకిస్తున్నా.. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తాజాగా తీసుకున్న నిర్ణయాలు అమల్లోకి వచ్చాయి. గతంలో ప్రకటించిన విధంగా ఫిట్‌మెంట్ 23 శాతం కొనసాగనుంది. మారిన హెచ్‌ఆర్‌ఏ శ్లాబుల ప్రకారం.. 50 వేలలోపు జనాభా ఉంటే 10 శాతం, రూ.11 వేలు సీలింగ్ గా ఫైనల్ చేసారు.

హెచ్ఆర్ఏ శ్లాబుల్లో మార్పులు
50 వేల నుంచి 2 లక్షల జనాభా ఉంటే : 12 శాతం, రూ.13 వేలు సీలింగ్ గా నిర్ణయించారు. 2 లక్షల నుంచి 50 లక్షల జనాభా : 16 శాతం, రూ.17 వేలు సీలింగ్ (13 జిల్లా కేంద్రాలకు ఇదే శ్లాబు వర్తింపు) కు ఒప్పందం జరిగింది. 50 లక్షలకు పైబడి జనాభా ఉంటే 24 శాతం, రూ.25 వేల సీలింగ్ గా నిర్ణయించారు. సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాల్లో 24 శాతం హెచ్‌ఆర్‌ఏ (2022 జూలై నుంచి 2024 జూన్ వరకు) అమలు కానుంది. రిటైర్డ్ ఉద్యోగుల అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్..లోనూ మార్పులు అమల్లోకి వచ్చాయి. 70-74 ఏళ్ల వయసు వారికి : 7 శాతం కాగా, 75-79 ఏళ్ల వయసు వారికి : 12 శాతం గా నిర్ణయించారు.

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేక జీవో
గ్రాట్యుటీ గతంలోలా కాకుండా 2022 జనవరి నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. 2019 జూలై 1 నుంచి 2020 మార్చి 31 వరకు (9 నెలలు) ఉద్యోగులకు ఇచ్చిన మధ్యంతర భృతిని సర్దుబాటు చేయరు. దీని పైన ప్రభుత్వం నుంచి స్పష్టత ఇచ్చారు. వేతన సవరణ పరిమితి ఐదేళ్లు. కేంద్ర వేతన సవరణ కమిషన్‌ను రాష్ట్ర ఉద్యోగులకు వర్తింపజేయరు.
ఉద్యోగులు, పెన్షనర్ల అంత్యక్రియల ఖర్చులు రూ.25 వేలుగా నిర్ణయించారు. పాత పద్ధతి ప్రకారం సీసీఏ కొనసాగింపుకు నిర్ణయించారు. మారిన హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు ఈ ఏడాది జనవరి నుంచి అమలు కానుంది. ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి ప్రత్యేక జీఓ విడుదల కానుంది. సీపీఎస్ అంశాన్ని పరిశీలించేందుకు ఒక కమిటీ ఏర్పాటు కానుంది.

సీపీఎస్ పైన సీరియస్ గా ఫోకస్
2022 మార్చికల్లా దీనిపై రోడ్ మ్యాప్ రూపకల్పన చేయనున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కమిటీ ఏర్పాటు. ఎన్‌ఎంఆర్ ఉద్యోగుల అంశం దీనిలోనే పరిశీలన చేయనున్నారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ ఎక్స్‌టెన్షన్‌కు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో విడుదల కానున్నాయి. ఈహెచ్‌ఎస్ హెల్త్ స్కీమ్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోనున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ 2022 జూన్ 30లోపు ఖరారు. అప్పటి నుంచి స్కేల్స్ వర్తింపు కు నిర్ణయించారు. వీటికి అనుగుణంగా మినిట్స్ పైన రెండు వైపుల అంగీకార సంతకాలు చేసారు.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications