TTD: శ్రీవారి భక్తుల కోసం డిజిటల్ సేవలు- శాశ్వత ఐడీ, వసతి ఇక ఇలా..!!
Tirumala: తిరుమలలో భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సౌకర్యాల పెంపు పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. కొత్తగా ఏఐ ఆధారిత దర్శనం.. సేవల కోసం పైలెట్ ప్రాజెక్టుగా అమలుకు కసరత్తు జరుగుతోంది. అదే సమయంలో వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సమయంలో అసెంబ్లీ అంచనాల కమిటీ టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహించింది. భక్తుల సేవల విషయంలో కీలక సూచనలు చేసింది. భక్తుల కోసం సాంకేతికత ఆధారిత సేవలు టీటీడీ ప్రారంభించనుంది
అసెంబ్లీ కమిటీ పరిశీలన
టీటీడీ లో అసెంబ్లీ అంచనాల కమిటీ పర్యటించింది. భక్తులకు అందుతున్న సేవలను పరిశీలన చేసింది. ఆ తరువాత టీటీడీ అధికారులతో పలు అంశాల పైన ఆరా తీసింది. భక్తులకు సేవలు బాగున్నాయని ప్రశంసించింది. అదే విధంగా క్యూ లైన్ల నిర్వహణలో కొన్ని సూచనలు చేసింది. భక్తులకు అత్యవసరమైన సమయంలో అందుబాటులో ఉన్న వైద్య సేవల గురించి వివరాలు సేకరించింది. దర్శనంలో సాంకేతికంగా తీసుకొస్తున్న మార్పుల పైన ఆసక్తి చూపించింది. దీంతో, త్వరలోనే టీటీడీలో ఏఐ ఆధారిత సేవలను ప్రవేశ పెట్టేలా కసరత్తు జరుగుతున్నట్లు అధికారులు వివరించారు.

భక్తులకు శాశ్వత ఐడీ
ఇప్పటికే ప్రతీ భక్తుడికి శాశ్వత ఐడీ ఇవ్వటం ద్వారా దర్శనం.. వసతి, సేవలు పొందేలా కసరత్తు కొనసాగుతోంది. తిరుమలలో డిజిటల్ మీడియా బలోపేతం చేయాలని కమిటీ సభ్యులు టీటీడీకి సూచించారు. ఇక శ్రీవారి వైభనాన్ని తెలియచేసేలా డిజిటల్ మీడియాను బలోపేతం చేయాలని అసెంబ్లీ కమిటీ టీటీడీకి సూచన చేసింది. అదే సమయంలో వసతి విషయంలో వస్తున్న ఫిర్యాదు ల పైన ఆరా తీసింది. కాగా, వసతి కోసం న్యాయస్థానం నిబంధనలకు లోబడి కాలం చెల్లిన భవనాల స్థానంలో కొత్త వసతి సముదాయాలు నిర్మిస్తున్నామని టీటీడీ అధికారులు వివరించారు. గదుల చెక్ అవుట్ సమయంలో ఫేస్ రికగ్నజేషన్ లో వస్తున్న సమస్యల పరిష్కారం పైన ఫోకస్ చేసినట్లు పేర్కొన్నారు. వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి ఈ మార్పులు జరిగేలా కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications