దేశంలోనే తొలి క్యాన్సర్ పరిశోధనా కేంద్రం.. ఏపీ ప్రభుత్వంతో చారిత్రాత్మక ఒప్పందం!

క్యాన్సర్ రంగంలో జన్యుపరమైన పరిశోధనల ద్వారా వైద్య చికిత్సలను అందించేందుకు వీలుగా కీలకమైన ముందడుగు పడింది. అమరావతిలో ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ అంకాలజీ విధానాన్ని ప్రారంభించేందుకు వీలుగా అంతర్జాతీయ ఫార్మాసుటికల్, బయో టెక్నాలజీ దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనెకా ఇండియా ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలో ఇంటిగ్రేటెడ్ జెనోమిక్స్ సొల్యూషన్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో వైద్యారోగ్యశాఖ- ఆస్ట్రాజెనెకా ఇండియా సంస్థల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. రిలయన్స్‌కు చెందిన స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్, క్యూఆర్ఏఐ సంస్థలతో కలిసి ఆస్ట్రా జెనెకా ఇండియా ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్స్ సెంటర్ ఏర్పాటు చేయనుంది.

అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ అంకాలజీ చికిత్సా విధానాన్ని ప్రారంభించేందుకు ఈ ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఊపిరితిత్తులు, రొమ్ము కాన్సర్ రోగుల కోసం అధునాతన జన్యు పరీక్షలు, బయోమార్కర్ టెస్టింగ్ చేసేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్ సెంటర్‌ను ఆస్ట్రా జెనెకా ఏర్పాటు చేయనుంది. అమరావతి క్వాంటం వ్యాలీ- ఆస్ట్రా జెనెకా ఇండియా భాగస్వామ్యంతో ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ అంకాలజీ చికిత్సా విధానాన్ని ప్రారంభించనున్నారు.

AstraZeneca Partners With AP Govt India s 1st Precision Oncology amp amp Genomics Center to Come Up in Amaravati

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ , నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ , ఆధునిక జన్యుచికిత్సా విధానాల్ని వినియోగించి కాన్సర్ ప్రారంభదశలోనే గుర్తించి శరీర తత్వానికి అనుగుణంగా చికిత్స అందించేలా ఈ ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ అంకాలజీ విధానం ఉపకరించనుంది. ఊపిరితిత్తుల కాన్సర్ ను ముందుగా గుర్తించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన ఎక్స్ రే ఆధారిత వ్యవస్థను ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయనుంది. తద్వారా రోగులను వేగంగా స్క్రీనింగ్, డయాగ్నోస్టిక్ సేవలు అందటం తో పాటు ఎలాంటి జాప్యం లేకుండా చికిత్స చేసేందుకు వీలుగా మార్గం సుగమం కానుంది.

El Nino: రైతులకు అలర్ట్. పంటల బీమాతో పాటు ప్రత్యామ్నాయ సాగు..
El Nino: రైతులకు అలర్ట్. పంటల బీమాతో పాటు ప్రత్యామ్నాయ సాగు..

వైద్య రంగంలో పరిశోధనలకు క్వాంటంవ్యాలీ సేవలు

ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సదుపాయాలను తీసుకురావటమే ఈ ఒప్పందం లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఫార్మా, బయో టెక్నాలజీ రంగాల్లో క్వాంటం పరిశోధనలు జరగాల్సి ఉందని సీఎం సూచించారు. కాలుష్యం లాంటి బాహ్య కారణాల వల్ల కూడా ప్రమాదకరమైన కాన్సర్ బారిన పడుతున్నారని... ముందే గుర్తించి చికిత్సలు అందించటం ద్వారా రోగులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. వైద్య రంగంలోని వ్యవస్థలు ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంలో పనిచేయాలని సీఎం సూచించారు.

లోకేష్ పిలుపుతో కదిలిన పార్టీ శ్రేణులు.. ప్రతి గడపకూ రెండేళ్ల పాలనా విజయాలు!
లోకేష్ పిలుపుతో కదిలిన పార్టీ శ్రేణులు.. ప్రతి గడపకూ రెండేళ్ల పాలనా విజయాలు!

ఏపీలో సంజీవని ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని ప్రతీ పౌరుడి హెల్త్ ప్రొఫైల్ ను డిజిటల్ రికార్డులుగా మారుస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. వైద్యారోగ్య రంగంలో మరింత వేగంగా ట్రాన్సఫర్మేషన్ జరగాల్సి ఉందని తెలిపారు. కేన్సర్ తో పాటు ఇతర వ్యాధులపై కూడా అమరావతి క్వాంటం వ్యాలీ నుంచి విస్తృతంగా పరిశోధనలు జరగాలని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+