ఏపీలో దారుణం.. మృగంలా మారిన తండ్రి.. కన్న కూతురిపై అత్యాచారం
ఆడబిడ్డకి ఆపద వస్తే ముందు గుర్తుకు వచ్చేది తండ్రి. అలాంటిది ఆ ఆపదే తండ్రి అయితే.. కొండంత దైర్యంగా బిడ్డకు తోడుగా ఉండాల్సిన వ్యక్తి.. జీవితాన్ని నాశనం చేస్తే.. ఆ బిడ్డ ఎంతతి శోకంలో నిండిపోతుంది. బిడ్డకు రక్షణగా ఉంటూ భద్రత కల్పించాల్సిన తండ్రే అఘాయిత్యానికి పాల్పడుతుంటే ఆ ఆడ బిడ్డ బయటకు చెప్పుకోలేకపోయింది. కనీసం ఆ బాధను చెప్పకోడానికి తోడుగా తల్లి లేని తరుణంలో.. కాల్స్ టీచర్ అమ్మలాగా ఆదరించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
బయటవాళ్లు ఏమైనా అంటే 'మా నాన్నకు చెబుతా' అని బెదిరిస్తారు పిల్లలు. అలాంటిది ఓ దుర్మార్గుడు తన కూతురిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ఓ మృగం లాగా మారాడు. కన్నబిడ్డను రక్షించాల్సిన తండ్రే ఆమెకు జీవితాంతం చెరగని గాయాన్ని మిగిల్చాడు. ఈ దారుణ ఘటన రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సభయ సమాజం సైతం సిగ్గుపడే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రాజమండ్రిలో ఓ వ్యక్తి మెకానిక్‌గా పని చేస్తూ జీవిస్తున్నాడు. అతని వయస్సు 45 సంవత్సరాలు. ఇతనికి 17 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయితే దంపతుల మధ్య విభేదాలు రావడంతో ఎనిమిదేళ్ల కిందట పిల్లలను తీసుకుని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ పదిహేనేళ్ల పెద్ద కుమార్తె మాత్రం మూడేళ్లుగా తండ్రి వద్దకు వచ్చి ఉంటోంది.
స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతోంది బాలిక. గత మంగళవారం నాడు పాఠశాలకు వచ్చిన బాలిక నిరుత్సాహంగా ఉండడాన్ని ఉపాధ్యాయురాలు గమనించారు. బాలికను ఓదార్చుతూ మాట్లాడితే తండ్రి గత కొద్ది రోజులుగా తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు చెప్పి కన్నీరు పెట్టుకుంది. దీంతో వెంటనే ఆమె ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లింది. బాలిక ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications