నాటు కోడి కిలో రూ.500, మటన్‌ రూ.900: YS Avinash Reddy

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ... వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అడిగిన ఓ ప్రశ్న ఇప్పుడు రాజకీయంగానే కాదు, సోషల్ మీడియాలో కూడా పెద్ద దుమారం రేపుతోంది. కీలకమైన జాతీయ వేదికపై రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలను లేవనెత్తాల్సిన సమయంలో... "నాటుకోడి ధరలపై ప్రశ్న ఏంటి?" అంటూ ప్రతిపక్షాల నుంచే కాదు, నెటిజన్ల నుంచీ కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కడప నుంచి వైసీపీ తరఫున ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి, లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్‌లో నాటుకోడి మాంసం ధరల అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో మటన్ కంటే నాటుకోడి మాంసం ధర ఎక్కువగా ఉందని పేర్కొంటూ... ఈ పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి తెలుసా? అంటూ ప్రశ్నించారు. అంతేకాదు, పౌల్ట్రీ రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం రోగ నియంత్రణ, బయో సెక్యూరిటీ, బీమా వంటి చర్యలు తీసుకుంటుందా? ఒకవేళ తీసుకోకపోతే కారణాలేంటని నిలదీశారు.

Avinash Reddy s Chicken Price Question in Parliament Triggers Political Controversy and Social Media Trolls

ఈ ప్రశ్నకు కేంద్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సమాధానం ఇచ్చారు. ఆయన సమాధానమే ఇప్పుడు మరో వివాదానికి దారితీసింది. ఆంధ్రప్రదేశ్‌లో నాటుకోడి మాంసం ధర కిలో రూ.500గా ఉందని, అదే సమయంలో మటన్ ధర కిలో రూ.900 వరకు ఉందని సభకు తెలిపారు. అంటే... నాటుకోడి మటన్ కంటే ఖరీదైనదన్న ఎంపీ వాదనకు కేంద్ర గణాంకాలు సరిపోలలేదన్న అభిప్రాయం వెలువడుతోంది.

కేంద్రమంత్రి స్పష్టం..

ఇంకా బర్డ్ ఫ్లూ వంటి వ్యాధుల కారణంగా పౌల్ట్రీ రంగానికి నష్టం వాటిల్లితే, పరిహారంలో భాగంగా కేంద్రం 50 శాతం నిధులు అందిస్తుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. కోళ్లకు వచ్చే వ్యాధులను నియంత్రించేందుకు వ్యాక్సినేషన్ సహాయాన్ని కూడా కేంద్రం అందిస్తోందన్నారు. ఎంపీ అడిగిన మిగతా ప్రశ్నలు ఉత్పన్నం కావని, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగానే సమాధానం ఇచ్చామని చెప్పారు.

సోషల్ మీడియాలో ట్రోల్స్..

ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు రాజకీయ విమర్శలకు కారణమవుతోంది. "అమరావతి, ప్రత్యేక హోదా, కేంద్ర నిధులు, రాష్ట్ర ప్రయోజనాలపై ప్రశ్నలు అడగాల్సిన పార్లమెంట్‌లో... నాటుకోడి ధరలేనా?" అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. మరోవైపు, రైతుల సమస్యల్ని ప్రస్తావించడంలో తప్పేముందని వైసీపీ వర్గాలు ఎదురుదాడి చేస్తున్నాయి.

ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాల అంశాలు, మరోవైపు ప్రజల దైనందిన సమస్యలు... పార్లమెంట్ వేదికపై ఏది ప్రాధాన్యం అన్నదే ఇప్పుడు రాజకీయ చర్చగా మారింది. నాటుకోడి ధరల ప్రశ్నతో మొదలైన ఈ అంశం... అవినాష్ రెడ్డి రాజకీయ పాత్రపై, వైసీపీ పార్లమెంటరీ వ్యూహాలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+