సీఎం చంద్రబాబు చేతుల మీదుగా స్వచ్చాంధ్ర అవార్డులు.. ఎంపికైన మున్సిపాలిటీలు, గ్రామాలివే!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛతకు పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ఏపీలోని కూటమి ప్రభుత్వం స్వచ్చ భారత్ లక్ష్యానికి అనుగుణంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దడం కోసం చంద్రబాబు సర్కార్ ప్రత్యేకమైన దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛత కార్యక్రమాలలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన వారికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు అందిస్తోంది.
చంద్రబాబు చేతుల మీదుగా స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు
ఈ నెల 6 న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా విజయవాడ లో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు 2025 ప్రదానం చేయనున్నట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. మొత్తం 21 కేటగిరీల్లో జిల్లా,రాష్ట్ర స్థాయిలో అవార్డులు ప్రకటించిన స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అవార్డుల ఎంపికలో పారదర్శకత పాటించింది. స్వచ్చ ఆంధ్ర కోసం మొత్తం రాష్ట్ర స్థాయిలో 69 అవార్డులు,జిల్లాల్లో 1257 అవార్డులు ఇవ్వనుంది.

వివిధ కేటగిరీలలో అవార్డుల ప్రదానం
స్వచ్ఛత కార్యక్రమాలలో అద్భుతమైన ప్రతిభ చూపించిన మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులను ఇస్తున్న తరహా లోనే, రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను ఇచ్చి ప్రోత్సాహాన్ని అందించనుంది. స్వచ్ఛ మునిసిపాలిటీలు,స్వచ్ఛ గ్రామ పంచాయతీలు ,స్వచ్ఛ స్కూల్స్ ,స్వచ్ఛ ఆసుపత్రులు,స్వచ్ఛ కార్యాలయాలు,స్వచ్ఛ రైతు బజార్లు,స్వచ్ఛ బస్సు స్టేషన్లు,స్వచ్ఛ పరిశ్రమల కేటగిరీల్లో అవార్డులకు ఎంపిక చేసి వారికి అందించనున్నారు.
రాష్ట్ర స్థాయిలో 6 స్వచ్ఛ మున్సిపాలిటీలు ఇవే
మూడు దశల్లో వెరిఫికేషన్ తర్వాత, పూర్తి డిజిటల్ విధానంలో అవార్డులకు ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ స్వచ్ఛ ఆంధ్ర అవార్డులకు రాష్ట్ర స్థాయిలో 6 మున్సిపాలిటీలు,6 గ్రామ పంచాయతీలు ఎంపిక చేశారు. అవార్డులకు ఎంపికైన మునిసిపాలిటీల వివరాలలోకి వెళితే మంగళగిరి -తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్,తాడిపత్రి, బొబ్బిలి,పలమనేరు, ఆత్మకూరు(నెల్లూరు జిల్లా),కుప్పం ఉన్నాయి.
స్వచ్చ గ్రామ పంచాయతీలు ఇవే
గ్రామ పంచాయతీలలో చౌడువాడ(అనకాపల్లి జిల్లా),ఆర్.ఎల్.పురం(ప్రకాశం జిల్లా),లోల్ల(కోనసీమ జిల్లా),చల్లపల్లి(కృష్ణా జిల్లా),చెన్నూరు(వైఎస్సార్ కడప జిల్లా),కనమకుల పల్లె(చిత్తూరు జిల్లా) ఎంపికయ్యాయి. ఈ స్వచ్ఛ ఆంధ్ర అవార్డులలో అద్భుతంగా ప్రతిభ కనబరిచిన, స్వచ్ఛతకు పెద్దపీట వేసిన పారిశుద్ధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్ లు, స్వయం సహాయక సంఘాలు కూడా అవార్డులను అందుకోనున్నాయి.
-
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
LPG: ఏపీలో వ్యాపారులకు ఊరట- కమర్షియల్ గ్యాస్ పై సర్కార్ ఉత్తర్వులు..! -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఏపీ, తెలంగాణలో జనగణన - ఇవ్వాల్సిన వివరాలు, మార్గదర్శకాలు..!! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
ఏపీలో ఏకీకృత పెన్షన్ పథకం మార్గదర్శకాలు జారీ..! ఈ ఉద్యోగులకు..! -
End of Naxalism : ఆంధ్రప్రదేశ్లో ముగిసిన ఎర్రజెండా శకం.. -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !!











Click it and Unblock the Notifications