ఆ ఇద్దరి పక్కన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన 'బేబీ' బ్యూటీ
'బేబీ' సినిమాతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నారు వైష్ణవి చైతన్య. అచ్చమైన తెలుగు అందంతో నటనలోను తిరుగులేదని చాటిచెప్పారు. కొత్తగా వస్తున్న అవకాశాల విషయంలోను జోరు చూపిస్తోంది. యంగ్ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, ఆశిష్ సినిమాల్లో హీరోయిన్ గా ఎంపికైంది.
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఇటీవలే ఓ సినిమా ప్రారంభమైంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. కథానాయికగా వైష్ణవిని ఎంపిక చేశారు. ఆశిష్ హీరోగా అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఓ చిత్రం మొదలైంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగార్జున మల్లిడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కూడా బేబీ బ్యూటీ వైష్ణవి పచ్చజెండా ఊపించింది.

సాయి రాజేష్ దర్శకత్వంలో విడుదలైన బేబీ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించారు. ఈ చిత్రంలో అప్పటివరకు యూట్యూబర్ గా ఉన్న వైష్ణవి హీరోయిన్ గా చేసింది. యూత్ కు ఈ సినిమా ఎక్కువ కనెక్ట్ కావడంతో ఘన విజయం దక్కింది. అలాగే వైష్ణవి చైతన్య నటనకు కూడా సూపర్ మార్కులు పడ్డాయి. ఎక్కడ చూసినా ఈ బేబీ గురించే టాక్ నడుస్తోంది. ఆఫర్లు వస్తుండటంతోపాటు తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ సరసన ఒక హీరోయిన్ గా ఎంపికైందని వార్తలు వస్తున్నాయి.
వరుసగా ఆఫర్లు వస్తుండటంతో వైష్ణవి ఎటువంటి సినిమాలు ఎంపిక చేసుకుంటుందా? అనే డైలమాలో ఆమె అభిమానులున్నారు. అయితే జాగ్రత్తగా కథ నచ్చితేనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించడంతో హమ్మయ్య.. మా హీరోయిన్ అన్నీ బేబీ లాంటి సినిమాలే చేస్తుంది అంటున్నారు.












Click it and Unblock the Notifications