జెత్వానీ కేసులో ఐపీఎస్ లకు టెన్షన్, వైసీపీ లీడర్ పిటీషన్
బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వానీ కేసులో పోలీసు అధికారులు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం హైకోర్టులో పోలీసు అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ జరిగింది. ఇదే సమయంలో పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గురువారం హైకోర్టులో తన వాదనలు వినిపించనున్నారు.
ఈ కేసు విచారణ గురువారానికి వాయిదా వేస్తున్నామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. బాలీవుడ్ నటి కాదాంబరీ జెత్వానీ అరెస్ట్ కావడానికి ప్రధాన నిందితుడైన వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ తన రిమాండ్ ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన క్లైంట్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని, ఈ కేసుకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ తరపున న్యాయవాదులు హైకోర్టులో చెప్పారు.

వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ముగిసింది. తదుపరి విచారణ ఈనెల 16వ తేదీకి వాయిదా పడింది. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ కారణంగానే పోలీసు అధికారులు తనతో పాటు తన తల్లిదండ్రులను అరెస్టు చేశారని, కస్టడీలో మమ్మల్ని పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వానీ విజయవాడ పోలీసుల సిటీ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.
బాలీవుడ్ నటి కాదాంబరీ జెత్వానీ ఫిర్యాదు చేయడంతో ఐపీఎస్ అధికారులు, ఏసీపీ, సీఐ తదితరుల మీద విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీఎస్ లు, ఏసీపీ, సీఐలు ముందస్తు బెయిల్ కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తుకు ఆటంకం కలిగే అవకాశం ఉందని, వాళ్లకు బెయిల్ మంజూరు చేయకూడదని బాలీవుడ్ నటి కాదాంబరీ జెత్వానీ తరపు న్యాయవాదులు కోర్టుకు మనవి చేశారు. ఈ కేసులో గురువారం ముందస్తు బెయిల్ వస్తుందా ? అనే విషయంపై ఆ పోలీస్ అధికారులు టెన్షన్ పడుతున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications