చంద్రమోహన్ మృతిపై బాలకృష్ణ, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ దిగ్భ్రాంతి!!
ప్రముఖ నటులు చంద్రమోహన్ మృతి పట్ల సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. చంద్రమోహన్ సినీ పరిశ్రమకు చేసిన సేవలను పలువురు కొనియాడుతున్నారు. చంద్రమోహన్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చంద్రమోహన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు . ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవడం వ్యక్తిగతంగా తనకు తీరనిలోటని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.
ప్రాణం ఖరీదు సినిమా సందర్భంగా ఆయనతో ఏర్పడిన తొలి పరిచయం ఆ తర్వాత మంచి స్నేహంగా మారిందని మారిందని ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సిరిసిరిమువ్వ, శంకరాభరణం, రాధాకళ్యాణం, నాకు పెళ్ళాం కావాలి ఇలాంటి అనేక అపూర్వమైన సినిమాలలో తన వైవిధ్య నటనకౌశలం ద్వారా తెలుగు వారి మనసులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు చంద్రమోహన్ అని వెల్లడించారు.

కథానాయకులు చంద్రమోహన్ ఇక లేరని తెలియడం ఎంతో విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. చంద్రమోహన్ మృతి పట్ల బాలకృష్ణ స్పందించారు .
చంద్రమోహన్ రెడ్డి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన బాలకృష్ణ పౌరాణిక చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు, హాస్య కథ చిత్రాలలో నటనతో ఆకట్టుకున్నారు అని గుర్తు చేసుకున్నారు. తనతో కలిసి పనిచేశానని గుర్తు చేసుకున్న బాలకృష్ణ ఆయన మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అన్నారు. చంద్రమోహన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని బాలకృష్ణ తెలియజేశారు.
చంద్రమోహన్ మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఆయన మృతి తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. ఎన్నో దశాబ్దాలుగా చలనచిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న చంద్రమోహన్ అకాల మరణం చెందడం బాధాకరంగా ఉందన్నారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications