టిడిపిపై దాడి: వైయస్ జగన్ పార్టీపై బాలయ్య ఫిర్యాదు
హైదరాబాద్: అనంతపురం జిల్లా లేపాక్షి మండలంలోని గొంగటిపల్లి సమీపంలో సోమవారం మధ్యాహ్నం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడిచేశారు. ఈ దాడిలో ఆరుగురు టిడిపి కార్యకర్తలు తీవ్రంగా గాయపడగా వారి వాహనం ద్వంసమైంది. దీనిపై లేపాక్షి పోలీస్‌స్టేషన్‌లో బాలకృష్ణ ఫిర్యాదు చేశారు.
కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో వైయస్సార్ కాంగ్రెసు ప్రచార రథంపై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేశారు. ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని వలపర్ల గ్రామంలో సోమవారం తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.

పర్చూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి గొట్టిపాటి భరత్ తల్లి పద్మ, అతని సోదరి లక్ష్మీలు గ్రామంలో రోడ్డు షో నిర్వహించారు. అదే సమయంలో టిడిపి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు కార్యకర్తలతో రోడ్డు షో నిర్వహిస్తూ వారికి ఎదురయ్యారు. ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగారు.
విశాఖపట్నం జిల్లా గాజువాక కాంగ్రెస్ అభ్యర్థి, సినీనటుడు జీవీ సుధాకర్‌నాయుడుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి దాడి చేశారు. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కారు అటకాయించి, రాడ్లతో దాడి చేయగా జీవీ అపస్మారక స్థితికి చేరుకోగా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications