దృష్టి పెట్టిన బాలయ్య, తప్పు చేస్తే..: బాబుకు రఘువీరా

అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా శుక్రవారం హిందూపురం నుండి సోమందేపల్లి వరకు రూ.10 కోట్ల వ్యయంతో 25 కిలోమీటర్ల మేర చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.

హిందూపురం ప్రజలకు తాగునీరు అందించేందుకు వాటర్ ప్లాంటు నిర్మాణానికి పూజల చేశారు. ప్రజలకు తాగునీరు కోసం వాటర్ ప్లాంటు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎన్టీఆర్ సుజల ధార పథకం ద్వారా రెండు రూపాయలకే ఇరవై లీటర్ల తాగునీరు ఇవ్వనున్నట్లు చెప్పారు.

Balakrishna keen on developing Hindupuram

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తెలుగుదేశం పార్టీ నెరవేరుస్తుందని చెప్పారు. బాలకృష్ణ రెండు రోజులుగా హిందూపురం నియోజకవర్గంలోనే ఉంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రఘువీరా సూచనలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎపిసిసి అధ్యక్షులు రఘువీరా సూచనలు చేశారు. తమ ప్రభుత్వం (కాంగ్రెస్) పథకాల్లోని లోటుపాట్లను సవరించి కట్టుదిట్టంగా అమలు చేయాలని, మధ్యాహ్న భోజనం, ఆదర్శ రైతులు, రేషన్ డీలర్లను తొలగించవద్దని కోరారు. ఇక కమిటీల పేరుతో జాప్యం చేయవద్దన్నారు. తమ పాలనలో తప్పుచేసిన వారిపై చట్టబద్ధ సంస్థతో విచారణ చేయించవచ్చని రఘువీరా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+