'అందుకే.. కనిపించిన వారికల్లా జగన్ షేక్‌హ్యాండ్, నాకూ ఇస్తాడు'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి తమతో అవసరం ఉందన్న తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఆ అవసరం ఏమిటో చెప్పారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి తమతో అవసరం ఉందన్న తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఆ అవసరం ఏమిటో చెప్పారు.
తెలుగుదేశం పార్టీ నుంచి 28 మంది ఎమ్మెల్యేలు వైసిపిలో చేరితే సీఎంను అవుతానని జగన్ ఆశపడుతున్నారని, ఆయనకు ఎమ్మెల్యేల అవసరం ఉందని, తనకు మాత్రం లేదని జేసీ ప్రభాకర్ అన్నారు.
తనకు అసెంబ్లీలో జగన్ ఎదురుపడితే షేక్ హ్యాండ్ ఇస్తాడని, ఎందుకంటే తాను ఎమ్మెల్యేను అని, సీఎం అయ్యేందుకు తన అవసరం వైసిపి అధినేతకు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

జగన్ ఎక్కడకు వెళ్లినా తాను ముఖ్యమంత్రిని అని హూంకరిస్తున్నారని, అందుకే కనిపించిన ప్రతి ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడన్నారు.
సోమవారం నాడు జగన్.. జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి మాట్లాడారు. కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం బాధాకరమన్నారు. బాధితులకు భరోసా ఇచ్చేందుకు వెళ్తే కేసులు పెట్టారన్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి తన గురించి చేసిన వ్యాఖ్యల గురించి స్పందిస్తూ... ఆయనకు మతిస్థిమితం ఉందో లేదో తెలియదని, ఆయన గురించి మాట్లాడటం వృథా అని, గజరాజు వెళ్తున్నప్పుడు కుక్కలు మొరగడ సహజమన్నారు.












Click it and Unblock the Notifications