ఏపీలోని బెలూం గుహలకు GSI గుర్తింపు.. మంత్రి దుర్గేష్ హర్షం
దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన బెలూం గుహలకు ఎనలేని గుర్తింపు లభించింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలూం గుహలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(GSI) అధికారిక గుర్తింపు ఇచ్చింది. భౌగోళిక వారసత్వ ప్రాధాన్యత కలిగిన ప్రదేశంగా బెలూం గుహలను గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలోని ప్రఖ్యాత చారిత్రక నేపథ్యం ఉన్న బెలూం గుహలకు GSI గుర్తింపు లభించింది. ఈ మేరకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దేశంలోనే అత్యంత పొడవైన గుహలుగా ఇప్పటికే ఇవి గుర్తింపు పొందాయి. ఈ గుహలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి ఏటా లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు.
దేశంలోనే అత్యంత పొడవైన గుహలుగా ఇప్పటికే బెలూంగుహలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. అయితే తాజాగా ఈ గుహలకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(GSI) అధికారిక గుర్తింపు ఇచ్చింది. ఈ క్రమంలో బెలూం గుహలకు జీఎస్ఐ గుర్తింపు ఇవ్వడంపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. జీఎస్ఐ జాబితాలో చోటు దక్కడం వల్ల బెలూం గుహలు మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని ప్రసిద్ధి చెందిన బెలూం గుహలను ఎట్టకేలకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(GSI) అధికారిక గుర్తింపు ఇవ్వడంపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచలో రెండోది, దేశంలోనే పొడవైన గుహలుగా బెలూం గుహలు ప్రసిద్ధి చెందాయన్నారు. దేశ పర్యాటక ప్రదేశాల్లో రాష్ట్రంలోని బెలూం గుహలకు ప్రత్యేక స్థానం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాక.. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా బెలూం గుహలపై మరింత ప్రచారం కల్పిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.

ఏపీలోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో ఈ గుహలు ఉన్నాయి. దేశంలోనే పొడవైన అంతర్భాగ గుహలుగా బెలూం గుహలు ప్రసిద్ధి చెందాయి. ఈ గుహలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి ఏటా లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. తాజాగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(GSI) అధికారిక గుర్తింపు ఇవ్వడంపై రాష్ట్ర ప్రతినిధులతోపాటు నంద్యాల జిల్లా ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకులతో తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications