టికెట్ అవసరంలేదు.. స్పెషల్ ట్రైన్.. ఎవరైనా ఎక్కొచ్చు
ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులను భారతీయ రైల్వే గమ్యస్థానాలకు చేరుస్తోంది. రైలు ప్రయాణం అంటే.. కచ్చితంగా టికెట్ తీసుకోవాలి. జనరల్, ఏసీ, స్లీపర్ అంటూ మూడురకాల టికెట్లు అందుబాటులో ఉంటాయి. అయితే ఎటువంటి టికెట్ లేకుండా ఉచితంగా ప్రయాణం చేయవచ్చనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ రైలు ఎక్కితే టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
భారతీయ రైల్వేలు ప్రపంచంలో అతి పెద్ద నెట్ వర్క్ కలిగిన రైల్వేలో నాలుగో స్థానంలో నిలిచింది. వేటికవి ప్రత్యేకంగా నిలిచే రైళ్లు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. భాగ్దా-నంగల్ డ్యామ్ మీద ప్రయాణం చేసే రైలు ప్రయాణికులను ఉచితంగానే వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది. హిమాచల్ ప్రదేశ్-పంజాబ్ సరిహద్దుల్లో భాగ్దా-నంగల్ డ్యామ్ నిర్మించారు. దీన్ని సందర్శించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణికులు ప్రతిరోజు వందల సంఖ్యలో వస్తుంటారు.

ఆనకట్టను చూడటానికి, ప్రయాణికులను ఇటువైపు నుంచి అటువైపుకు, అటువైపు నుంచి ఇటువైపుకు తీసుకువెళ్లేందుకు ఈ రైలును నడిపిస్తున్నారు. టికెట్ అవసరంలేదు. మొత్తం 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. డీజిల్ ఇంజన్ అమర్చారు. దీనికుండే కోచ్ లను చెక్కతో తయారు చేశారు. సట్లెజ్ నది, శివాలిక్ కొండల గుండా ఇది ప్రయాణిస్తుంది. ప్రతిరోజు 800 మందిని ఈ రైలు చేరవేస్తుంటుంది.
భారతీయ రైల్వే నెట్‌వర్క్ ప్రతిరోజూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెస్తోంది. ఇటీవలే దేశవ్యాప్తంగా 508 స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రణాళికలు ఆవిష్కరించారు. మరోవైపు ప్రధాన నగరాలను తక్కువ సమయంలో చేరుకునేలా 25 మార్గాల్లో వందే భారత్ రైళ్లను నడిపిస్తోంది.












Click it and Unblock the Notifications