Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమ్మఒడిపై చేతులెత్తేసిన జగన్ సర్కార్ ? సంక్రాంతికి లేనట్లే-వచ్చే జూన్ వరకూ ఆగాల్సిందే..

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక అమ్మఒడి పథకానికి అప్పుడే బీటలు వారడం మొదలైనట్లే కనిపిస్తోంది. ఇప్పటికే అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు నిబంధన కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు చెల్లింపుల్ని వాయిదా వేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకూ రెండేళ్లుగా సంక్రాంతికి ఠంచనుగా అందిస్తున్న అమ్మఒడి మొత్తం రూ.15 వేలను ఈ విద్యాసంవత్సరానికి మాత్రం వచ్చే సంక్రాంతికి బదులుగా జూన్ కు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించడమే ఇందుకు కారణం. ఈ లోపు విద్యార్ధుల తల్లితండ్రులు స్కూలు ఫీజుల్ని సొంత ఖర్చులతో చెల్లించాల్సిన పరిస్ధితి నెలకొంటోంది. దీంతో వారు లబోదిబోమంటున్నారు.

 జగన్ మానసపుత్రిక అమ్మఒడి

జగన్ మానసపుత్రిక అమ్మఒడి

వైసీపీ అధినేత, సీఎం జగన్ మానసపుత్రిక అయిన అమ్మఒడి పథకాన్ని కేవలం మన రాష్ట్రం మాత్రమే అమలు చేస్తోంది. రాష్ట్రంలో అక్షరాస్యత రేటు పెంచే లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా పిల్లల్ని స్కూళ్లకు పంపే తల్లుల ఖాతాల్లో ఏటా సంక్రాంతికి రూ.15 వేల రూపాయల మొత్తాన్ని వేస్తున్నారు. అయితే ఇందులో వెయ్యి రూపాయల్ని స్కూలు టాయిలెట్ల నిర్వహణ పేరుతో మినహాయించుకుని కేవలం రూ.14 వేలు మాత్రమే తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీంతో రెండేళ్లుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో పడుతున్న రూ.14 వేల మొత్తాలు వారి కుటుంబ అవసరాలకు, స్కూలు ఫీజులకు సర్దుబాటు చేసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాగో ఉచిత విద్యే కాబట్టి, ప్రైవేటు స్కూళ్లకు పిల్లల్ని పంపే తల్లితండ్రులకు ఇది ఎక్కువగా లబ్ది చేకూరుస్తోంది.

 75 శాతం హాజరు నిబంధనతో తొలి షాక్

75 శాతం హాజరు నిబంధనతో తొలి షాక్

అమ్మఒడి మొత్తాన్ని పొందాలంటే సదరు విద్యార్ది విద్యాసంవత్సరంలో 75 శాతం హాజరు కలిగి ఉండాలి. అంటే విద్యాసంవత్సరంలో ఉన్న మొత్తం పని దినాల్లో 75 శాతం రోజులు స్కూలుకు వెళ్లి తీరాల్సిందే. ఈ నిబంధన ముందే విధించినా రెండేళ్లుగా కరోనా పేరుతో దీన్ని పక్కనబెట్టారు. ఇప్పుడు కరోనా తగ్గడంతో 75 శాతం హాజరు నిబంధనను ప్రభుత్వం తొలిసారి తెరపైకి తెచ్చింది. దీంతో ఈ విద్యాసంవత్సరంలో నిర్ణీత హాజరు లేని విద్యార్ధులకు అమ్మఒడి చెల్లింపులు చేయరాదని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. దీంతో ఇప్పటివరకూ ఎలాంటి షరతులు లేకుండా అమ్మఒడి మొత్తం పొందుతున్న వారికి తొలి షాక్ తగిలింది.. విద్యాసంవత్సరం మొదలైనప్పుడు కాకుండా అక్టోబర్ లో ఈ విషయం చెప్పడంతో విద్యార్ధుల తల్లితండ్రులు గగ్గోలు పెడుతున్నారు.

 సంక్రాంతికి బదులు జూన్ లో అమ్మఒడి

సంక్రాంతికి బదులు జూన్ లో అమ్మఒడి

అమ్మఒడి కింద ఇస్తున్న రూ.14 వేల మొత్తాన్ని ప్రభుత్వం ఏటా సంక్రాంతికి తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది. రెండేళ్లుగా ఇది క్రమం తప్పకుండా సాగుతోంది. అయితే తొలిసారి ఈ విద్యాసంవత్సరంలో అమ్మఒడి మొత్తాన్ని సకాలంలో ఇవ్వలేమని ప్రభుత్వం తేల్చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో దాదాపు రూ.6500 కోట్ల అప్పు తెచ్చి సంక్రాంతికి అమ్మఒడి అమలు చేసే పరిస్ధితి లేకపోవడంతో దీన్ని కాస్తా వచ్చే జూన్ లో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అమ్మఒడి కింద ఇచ్చే మొత్తం ఈసారి కూడా సంక్రాంతికి వస్తుందని ఎదురుచూస్తున్న విద్యార్ధుల తల్లితండ్రులకు భారీ షాక్ ఎదురైంది. అదే సమయంలో చాలా సమీకరణాల్ని ఇది మార్చే అవకాశం కనిపిస్తోంది.

 వచ్చే ఏడాది స్కూళ్లు తెరిచాకే

వచ్చే ఏడాది స్కూళ్లు తెరిచాకే

ఏటా సంక్రాంతికి ఇస్తున్న అమ్మఒడి మొత్తాన్ని వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే జూన్ లో ఇవ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా సీఎం జగన్ విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏప్రిల్ లో విద్యా సంవత్సరం ముగుస్తున్నా జూన్ లో స్కూళ్లు తెరిచే వరకూ అమ్మఒడి మొత్తం కోసం విద్యార్ధుల తల్లితండ్రులు వేచి చూడక తప్పేలా లేదు. అదే సమయంలో అమ్మఒడి పథకాన్ని నమ్ముకుని వచ్చే ఏడాది ఫీజుల్ని ప్లాన్ చేసుకున్న తల్లితండ్రులు, స్కూళ్ల యాజమాన్యాలకు సైతం షాక్ తప్పేలా లేదు. దీంతో వారంతో ఇప్పుడు లబోదిబోమంటున్నారు. చేసేది లేక ప్రభుత్వం ఇచ్చే మొత్తం కోసం మరికొంతకాలం వేచి చూసేందుకు ప్రిపేరవుతున్నారు.

 అమ్మఒడిని బట్టి మారిన ఫీజుల సమయం

అమ్మఒడిని బట్టి మారిన ఫీజుల సమయం

ప్రతీ ఏటా సంక్రాంతికి ప్రభుత్వం అమ్మఒడి మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో జమచేస్తుండయంతో ఆ మేరకు విద్యాసంస్ధలు కూడా జనవరి నెలలోనే ఫీజులు తీసుకుంటున్నాయి. అప్పటివరకూ తల్లులు కూడా అమ్మఒడి వచ్చాకే ఫీజులు కడతామంటూ మొరాయిస్తున్నారు. దీంతో చేసేది లేక విద్యాసంస్ధల యాజమాన్యాలు కూడా జనవరి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం జనవరికి బదులు జూన్ నెలకు అమ్మఒడి చెల్లింపుల్ని వాయిదా వేయడం వల్ల తల్లితండ్రులు సొంత డబ్బులతో ఫీజులు కట్టుకోవాల్సిన పరిస్ధితి ఎదురుకానుంది. లేకపోతే యాజమాన్యాలు విద్యార్ధుల్ని స్కూళ్లకు రానిచ్చే పరిస్ధితులు ఉండకపోవచ్చు.

Recommended Video

    AP CM Has Maintained His Cool In Pawan Kalyan Matter | Oneindia Telugu
     అమ్మఒడిపై చేతులెత్తేసిన జగన్ సర్కార్

    అమ్మఒడిపై చేతులెత్తేసిన జగన్ సర్కార్

    రెండేళ్ల క్రితం అట్టహాసంగా మొదలుపెట్టిన అమ్మఒడి పథకాన్ని రెండేళ్లు తిరిగే సరికి ప్రభుత్వం వదిలించుకునేందుకు సిద్ధమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి అందులో భాగంగానే 75 శాతం నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించారన్న ఆరోపణలు వస్తున్నాయి. అదే సమయంలో సంక్రాంతికి ఇవ్వాల్సిన అమ్మఒడి మొత్తాన్ని వచ్చే విద్యాసంవత్సరం స్కూళ్లు తెరిచాక ఇవ్వాలని నిర్ణయించడం ద్వారా ప్రభుత్వం ఈ పథకాన్ని క్యాలండర్ ప్రకారం కాకుండా ఆలస్యం చేసేందుకు సిద్ధమైనట్లు తేలిపోతోంది. ప్రభుత్వం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్ధిక ఇబ్బందుల నేపధ్యంలో నవరత్నాల పేరుతో చేపట్టిన పథకాల అమలుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అమ్మఒడి వాయిదా ద్వారా ఇందులో తొలి షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+