విశాఖ జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్
ఏపీలో ఎన్నికల హీట్ పెరిగింది. గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో టికెట్లు దక్కని నేతలు..ఆయా పార్టీలు వీడి తమకు హామీ ఉన్న పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. టికెట్ దక్కని నేతలు, అసంతృప్తి నేతలు ఒక్కొక్కరు తమ పార్టీలను వీడుతున్నారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీని వీడారు. టీడీపీ, జనసేన పార్టీల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికల ముందు అధికార వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది.
విశాఖ జిల్లా కీలక నేత ఒకరు వైసీపీని వీడటానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. విశాఖ తూర్పు నియోజకవర్గం మాజీ ఇంఛార్జ్ అక్కరమాని విజయనిర్మల వైసీపీకి రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నారని సమాచారం అందుతోంది. గడిచిన నాలుగేళ్లుగా విశాఖ తూర్పు నియోజకవర్గం బాధ్యతలను నిర్వర్తించారామె. సరిగ్గా ఎన్నికల ముందు విజయనిర్మల స్థానంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఆ బాధ్యతలను అప్పగించింది. దీంతో ఆమె వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసిన తనకు సీటు నిరాకరించడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంవీవీ సత్యనారాయణను విశాఖ తూర్పు నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించిన దగ్గర నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే తన అనుచరులతో సమావేశం అయిన విజయనిర్మల తన రాజకీయ భవిష్యత్తు గురించి వారితో చర్చించారు. ఈ నేపథ్యంలో విజయనిర్మల టీడీపీలోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. కొద్ది రోజుల్లో ఆమె చంద్రబాబును కలిసి టీడీపీ పార్టీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications