‘గుంటూరు కారం’ సినిమా నుంచి బిగ్ అప్‌డేట్‌

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కతున్న చిత్రం గుంటూరు కారం. ఇప్పటికే విడుదలైన వీడియోలు, పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలను ఒక రేంజ్ కు తీసుకువెళ్లాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ మీనాక్షి చౌదరి బిగ్ అప్ డేట్ లీక్ చేసింది.

గుంటూరు కారంలో హీరోయిన్లుగా పూజా హెగ్డే, శ్రీలీలను ఎంపిక చేశారు. కొన్ని కారణాల వల్ల పూజా ఈ ప్రాజెక్ట్‌ నుంచి బయటకు వెళ్లింది. దీంతో శ్రీలీల మెయిన్ హీరోయిన్‌ అయింది. రెండో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)ని ఎంపిక చేశారు. అయితే దీన్ని గురించి చిత్ర బృందం అధికారికంగా చెప్పలేదు. అయితే 'హత్య' సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మీనాక్షి పాల్గొంది. తాను గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నట్లు లీక్ చేసింది. ఆ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ను కూడా ఇచ్చింది. దీంతో మహేష్ బాబు అభిమానులు సంబరపడుతున్నారు.

big update from maheshbabu and trivikram srinivas movie guntur kaaram

ప్రస్తుతం ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్తిచేసుకుందని, షూటింగ్ శరవేగంగా జరుగుతోందని చెప్పింది. మహేష్ బాబు అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనకు తాను అభిమానినని, ప్రిన్స్ తో నటిస్తున్న అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేనంది. తాను షూటింగ్ కు వెళ్లిన మొదటిరోజు మొదటి సన్నివేశమే మహేష్ తో ఉందని, ఆరోజును తాను జీవితకాలం గుర్తుంచుకుంటానని తెలిపింది. త్రివిక్రమ్‌, మహేష్ బాబుల హిట్ కాంబోలో నటిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు మీనాక్షి పరిచయమైంది. తొలి ప్రయత్నంలోనే అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత హిట్‌ 2, ఖిలాడి చిత్రాల్లో నటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+