జగన్ వస్తున్నాడని..: అమరావతిలో అఖిలప్రియపై దాడికి యత్నం

రాజధాని అమరావతిలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడికి యత్నించారు.

కర్నూలు: రాజధాని అమరావతిలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడికి యత్నించారు. వెలగపూడిలోని సచివాలయానికి వెళ్తున్న అఖిలప్రియను వైసిపి శ్రేణులు అడ్డుకున్నారు.

అతి కష్టం మీద పోలీసులు, గన్‌మెన్ల సాయంతో అఖిల ప్రియ సచివాలయానికి చేరుకున్నారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిల ప్రియ 2014లో వైసిపి నుంచి నుంచి తెదేపాలో చేరిన విషయం తెలిసిందే.

Bitter experience to Bhuma Akhila Priya

ఇక్కడ, మరో వాదన కూడా వినిపిస్తోంది. అఖిల ప్రియ సచివాలయానికి వెళ్తుండగా అదే మార్గంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వస్తోందని, జగన్ రాకతో రైతులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని, రోడ్డు పొడవున వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్ స్తంభించిందని, దీంతో చేసేదేమీ లేక అఖిల ప్రియ అక్కడి నుంచి వెనుదిరిగారంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+